E-Paper
Advertisement

Cherry Parcel Train: చెర్రీలతో బయల్దేరిన పార్శిల్ రైలు, ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!

Cherry Parcel Train: చెర్రీలతో బయల్దేరిన పార్శిల్ రైలు, ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!
Advertisement

Indian Railways: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. జమ్మూకాశ్మీర్ నుంచి తొలిసారి చెర్రీ లోడ్ తో కూడిన పార్శిల్ రైలు బయల్దేరింది. కత్రా రైల్వే స్టేషన్ నుంచి మొదలైన ఈ రైలు 30 గంటల్లో ముంబైకి చేరకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర రైల్వే విభాగంలో ఇదో చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. గతంలో కాశ్మీర్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పండ్లు పార్శిల్ చేయాలంటే.. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేది. రోజుల తరబడి ట్రక్కులలో వెళ్లే సరికి చాలా వరకు చెడిపోయేవి. మోడీ ప్రభుత్వం కాశ్మీర్ రైలు లింక్ పూర్తి చేయడంతో రవాణా రంగంలో సరికొత్త శకం మొదలైంది.

రైల్వేలో చారిత్రాత్మక రోజు

Advertisement

భారతీయ రైల్వే కత్రా నుంచి బాంద్రా వరకు 24 టన్నుల చెర్రీలను రవాణా చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు జమ్మూలోని ఉత్తర రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (DCM) ఉచిత్ సింఘాల్ తెలిపారు. జమ్మూ డివిజన్‌ నుంచి పార్శిల్ రైలు బయల్దేరడం ఓ చారిత్రాత్మక దినంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే అధికారులు, పండ్ల పెంపకందారుల సంఘాలు, జమ్మూ కాశ్మీర్ ఉద్యానవన శాఖ మధ్య చాలా చర్చల తర్వాత పండ్ల రవాణా మొదలైందన్నారు.  రాబోయే రోజుల్లో జమ్మూ డివిజన్ చెర్రీలను లోడ్ చేయడానికి మరో రెండు ఇండెంట్‌లను కలిగి ఉందన్నారు. వాటిలో ఒకటి కత్రా నుంచి కాగా, మరొకటి జమ్మూ నుంచి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్ ఉత్పత్తులు వేర్వేరు ప్రాంతాలకు ఇకపై గంటల సమయంలో డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చొరవ రైల్వే, పండ్ల పెంపకందారులతో పాటు జమ్మూ, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

దేశ వ్యాప్తంగా రవాణా విస్తరణ

Advertisement

కత్రా నుంచి బాంద్రా వరకు చెర్రీ రవాణా ప్రారంభం అయిన నేపథ్యంలో,  కాశ్మీర్ నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఇక్కడి పండ్లను రవాణా చేసే అంశంపై స్థానిక రైతు సంఘాలు రైల్వేలతో చర్చలు జరపుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, కాశ్మీర్ ఆపిల్, చెర్రీస్, ద్రాక్ష సహా కుంకుమ పువ్వును కూడా తరలించే అవకాశం ఉంటుంది. జమ్మూకాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరింత తోడ్పాటు లభించనుంది. అదే సమయంలో కాశ్మీర్ లోయలోని వివిధ స్టేషన్లలో పంటను లోడ్ చేయడం ద్వారా పండ్ల ఉత్పత్తిదారులకు మేలు కలిగే అవకాశం ఉంటుంది.

త్వరలో కాశ్మీర్ రైలు లింక్ ప్రారంభం

అత్యంత కీలకమైన కాశ్మీర్ రైలు లింక్ పూర్తి అయినప్పటికీ ప్రారంభం కాలేదు. త్వరలో ఈ లింక్ ను ప్రారంభించి  కాశ్మీర్‌కు నేరుగా రైలు సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ లింక్ ప్రారంభం అయితే, పర్యాటకరంగంతో పాటు స్థానిక వ్యవసాయ రంగం మరింత లాభదాయకంగా మారనుంది. నిజానికి ఈ రైల్వే లైన్ ఏప్రిల్ లోనే ప్రారంభం కావాల్సిన ఉన్నా, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ రైల్వే లింక్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: రైల్వేతో న్యాయపోరాటం, మూడేళ్ల తర్వాత రీఫండ్ పొందిన వృద్ధ దంపతులు!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×