Telugu Producers : అదో పెద్ద సినీ నిర్మాణ సంస్థ. అని వాళ్లే అనుకుంటారు. పెద్ద సినీ నిర్మాణ సంస్థ అంటే అద్దాల బిల్డింగ్‌లు కాదు కదా. పెద్ద సినిమాలు చేయ్యాలి. పెద్ద హిట్స్ కొట్టాలి. అన్నింటికంటే ముందుగా ఆ సంస్థలో పని చేసే వాళ్లకు సరిగ్గా శాలరీలు ఇవ్వాలి. పని చేయించుకున్న తర్వాత, పనికి తగినట్టు మనీ ఇవ్వాలి. ఇవేమీ లేకుండా… పెద్ద సినీ నిర్మాణ సంస్థ అని అనలేం.
ఇంతకీ ఆ పెద్ద సినీ నిర్మాణ సంస్థ ఎవరు..? అసలేం జరిగింది.? ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు..? ఎక్కడ సమస్య వచ్చింది.? ఆ సమస్య ఎలా బయటికి వచ్చింది..? అనేది ఇప్పుడు చూద్దాం…
చాలా పెద్ద లక్ష్యం పెట్టుకుని ఈ సినీ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా అన్నీ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. దీని వల్ల వచ్చే దానికంటే, పోయేదే ఎక్కువ ఉన్నా ఎక్కడా తగ్గకుండా అదే స్పీడ్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన నష్టాలను భర్తీ చేసే సినిమా త్వరలోనే రాబోతుందని, అన్ని కష్టాలు తీరుతాయని అనుకుంటున్నారు. ఆ సినిమాకు జరగబోయే బిజినెస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలా ఓ హీరో మూవీ షూటింగ్‌ని ప్రస్తుతం మహారాష్ట్రలో జరుపుతున్నారు. అయితే, అక్కడ సినిమా కోసం పని చేసే వాళ్లు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారట. డబ్బులు ఇవ్వడం పక్కన పెడితే, కనీసం భోజనాలు కూడా సరిగ్గా పెట్టడం లేదు అంటూ ఆ సినిమా కోసం పని చేసే వాళ్లు వాపోతున్నారు.
అంతే కాదు, ఆ పెద్ద సినీ నిర్మాణ సంస్థలో ఉండే ఓ మహిళ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆ మహిళ విషయంలో ఆ సినీ నిర్మాణ సంస్థ యజమానులు కూడా సైలెంట్‌గానే ఉంటున్నారట. అన్నీ తెలసి ఇలా సైలెంట్‌గా ఉండటం ఏంటి అని కొంత మంది ఎంప్లాయిస్ ఫైర్ అవుతున్నారట. అందులో చాలా మంది బయటికి వచ్చి ఆ నిర్మాణ సంస్థపై కంప్లైట్స్ కూడా చేస్తున్నారు. ఒకరు అయితే, ఏకంగా రెండు పేజీల లెటర్ రాశారు. అది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
చాలా పెద్ద లక్ష్యంతో ఉన్నా ఈ మూవీ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం నిజంగా దారుణమైన విషయం. ఎంప్లాయిస్‌ను గుర్తించకపోవడం, శాలారీ సరిగ్గా ఇవ్వకోవడం, మహారాష్ట్రలో షూటింగ్ స్పాట్‌లో జరుగుతున్నా వ్యవహారం, ఇటు ఆ సినీ నిర్మాణ సంస్ధ కార్యాలయంలో ఆ మహిళా చేస్తున్న పనులు ఇవేవీ కూడా ఆ నిర్మాణ సంస్థ యజమానికి తెలియదా..? ఒకవేళ తెలిసినా సైలెంట్‌గా ఉంటున్నారా..?