Saif Alikhan.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan )రాజవంశీయుల కుటుంబానికి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఆయన పటౌడీ వంశస్థుడు..అయితే అలాంటి పటౌడీ రాజవంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ తండ్రి పెద్ద క్రికెటర్.. ఆయన కొడుకు సైఫ్ అలీ ఖాన్ ఇండియాలోని స్టార్ హీరోలలో ఒకరు.అయితే అలాంటి సైఫ్ అలీ ఖాన్ పై తాజాగా హత్యాయత్నం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆయన కత్తిపోటుకు గురవ్వడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లికి సంబంధించి, ఒక సంచలన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఎవరైనా రెండు మూడు సంవత్సరాలు ఏజ్ లో పెద్దదైన అమ్మాయిని చేసుకుంటారు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఏకంగా తనకంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన హీరోయిన్ అమృతా సింగ్ (Amritha singh )ని పెళ్లాడారు. మరి అప్పుడప్పుడే మీసాలు వస్తున్న సైఫ్ అలీ ఖాన్ తనకంటే వయసులో పెద్దదైన అమృతా సింగ్ ప్రేమలో ఎలా పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం..
తొలిచూపులోనే ప్రేమలో పడ్డ సైఫ్ అలీఖాన్..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇండస్ట్రీలో హీరో కాకముందే ఆయన మొదటి భార్య అమృతా సింగ్ పెద్ద హీరోయిన్. అప్పటికే చాలా మంది స్టార్ హీరోలతో నటించి ఆమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. అలాంటి సమయంలో తొలిచూపులోనే సైఫ్ అలీఖాన్ కి అమృత సింగ్ పై ప్రేమ కలిగిందట. వీరిద్దరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట. అలా చూపులు కలిసిన శుభవేళ అన్నట్లుగా చూపులు కలవడంతోనే డిన్నర్ డేట్ కి ప్లాన్ చేసుకున్నారు. సైఫ్, అమృత సింగ్ ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి వెళ్ళిన సమయంలో ఎన్నో విషయాలు ముచ్చటించుకొని, సడన్గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.అలా మొదటి డిన్నర్ డేట్ సమయంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ టైంలో సైఫ్ ఏజ్ కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. అలా అప్పుడే యుక్త వయసులోకి వచ్చిన సైఫ్ అలీఖాన్ అమృతా సింగ్ తో ప్రేమలో పడి ఏజ్ ఎంత ఉంది అనేది పక్కనపెట్టి ప్రేమకు వయసుతో సంబంధం ఏంటి అనేలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది.
విడాకులకు కారణం..
కానీ ఎట్టకేలకు వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 13 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా వీరి సంసారాన్ని ముందుకు సాగించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు సడన్ గా దూరమయ్యారు.ఈ జంటకు ఇద్దరు పిల్లలు పుట్టాక గొడవలు వచ్చి చివరికి 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు తీసుకునే సమయంలో అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్ ని భారీగా భరణం డిమాండ్ చేసింది. రూ. 5కోట్ల భరణం తనకి ఇవ్వాలని చెప్పడంతో కోర్టు కూడా ఆమె డిమాండ్ కు ఒప్పుకొని రూ.5 కోట్లు ఇవ్వాలని సైఫ్ అలీఖాన్ కి చెప్పింది. అలా మొదట రూ.2.5 కోట్లను మొదటి భార్యకు ఇచ్చిన సైఫ్ అలీఖాన్, ఆ తర్వాత పూర్తి మొత్తాన్ని అప్పజెప్పారట. అంతేకాకుండా తన పిల్లల సంరక్షణ కోసం నెలకు లక్ష రూపాయలను అమృతా సింగ్ కి సైఫ్ అలీ ఖాన్ ఇచ్చేవారట. అయితే అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడానికి అనేక కారణాలు బీటౌన్ లో వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం వారి విడాకులకు కారణం చెప్పలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో అమృతా సింగ్ కి విడాకులకు కారణం చెప్పమని అడగగా..అది మా పర్సనల్ విషయం.. దాన్ని బహిరంగంగా చెప్పడం నాకు ఇష్టం లేదు అంటూ ఆ ప్రశ్నలను దాట వేసింది.అలా వీరి ప్రేమ, పెళ్లి కథకు 2004లో విడాకులతో ఎండ్ కార్డ్ పడింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ 2012లో హీరోయిన్ కరీనాకపూర్ (Kareena kapoor ) ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.