E-Paper
Advertisement

Actor Vijay: వరుస ప్లాపులు.. చివరి సినిమాకు అన్ని కోట్లు ఎలా అన్నా.. ?

Actor Vijay: వరుస ప్లాపులు.. చివరి సినిమాకు అన్ని కోట్లు ఎలా అన్నా.. ?
Advertisement

Actor Vijay: ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు హిట్స్, ప్లాప్ అనేది లెక్క ఉండదు. వారికున్న క్రేజ్, వారికున్న మార్కెట్ అన్నింటికీ కన్నా ఎక్కువ వారికున్న ఫ్యాన్ బేస్ ను ఆధారంగా ఆ లెక్కలు ఉంటాయి. తెలుగులో పవన్ కళ్యాణ్ కు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ్ లో అలాంటి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న హీరో అంటే దళపతి విజయ్ కు ఉంది అంటే అతిశయోక్తి కాదు.

నిజం చెప్పాలంటే.. గత కొన్నేళ్లుగా విజయ్, పవన్ కళ్యాణ్  ను ఫాలో అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలకు తగ్గట్టే విజయ్ పనులు కూడా పవన్ ను ఫాలో అవుతున్నట్లే ఉంది. ఇప్పటికే విజయ్.. ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలలోకి వచ్చేస్తున్నాడు. తాజాగా విజయ్ కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే.

Advertisement

దళపతి 69 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమానే విజయ్ చివరి చిత్రం. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ది గోట్ నే విజయ్ చివరి చిత్రం అనుకున్నారు. కానీ, విజయ్-వినోత్ కాంబోలో ఒక సినిమా ఎప్పటినుంచో హోల్డ్ లో ఉండడంతో.. దాన్ని పూర్తిచేసి సినిమాలకు బ్రేక్ఇస్తానని విజయ్ చెప్పడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Malavika Mohanan: ఇంటిమేటేడ్ సీన్స్.. దానిని తట్టుకోలేక.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Advertisement

ఇక దళపతి చివరి చిత్రం కావడంతో మేకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట. ఇప్పటికే సమంత, సిమ్రాన్, మమిత బైజు ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. దళపతి 69 కోసం విజయ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్  పారితోషికం తీసుకుంటున్న హీరోగా విజయ్ పేరు రికార్డ్స్ లో నిలిచిపోతుంది. ఈ ఒక్క సినిమా కోసం విజయ్ అక్షరాలా.. రూ. 275 కోట్లు అంట. ఏంటి.. అన్ని కోట్లా.. ? అసలు గత 5 ఏళ్లుగా విజయ్ కు ఒక్క సరైన హిట్ లేదు. అంతలా మెప్పించిన సినిమా కూడా లేదు.

Sakshi Malik Photos: కొత్త హీరోయిన్ గురూ.. సాక్షి మాలిక్ హాట్ ఫొటోలు చూశారా!.. అబబ్బా ఆ వేడి అందాలు..

మరి ఒక్క సినిమాకు విజయ్ అన్ని కోట్లు ఎలా తీసుకుంటున్నాడు.. ? అంటే.. విజయ్ లాంటి హీరోలకు హిట్స్- ప్లాప్స్ తో సంబంధం లేదు. విజయ్ కు ఉన్న ఇమేజ్ అలాంటింది మరి. అది కూడా విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కాబట్టి.. ఫ్యాన్స్ ఈ సినిమా కథ బాగున్నా.. బాగోలేకపోయినా.. హిట్ అయినా హిట్ కాకున్నా చూస్తారు. అందుకే విజయ్ కు అంత పారితోషికం ఇస్తున్నారు అని టాక్. ఈ పారితోషికంతోనే విజయ్ తన పార్టీని నడిపించనున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×