Malavika Mohanan: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రసుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే తంగలాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మాళవిక తెలుగులో రాజాసాబ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక నటిస్తోంది. ఇక ఇది కాకుండా హిందీలో ఈ చిన్నది యుధ్రా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్ కుర్ర హీరో సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ కథను అందించాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సిద్ధాంత్ తో మాళవిక చాలా ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించింది.
Dushara Vijayan: మామూలుగా లేదుగా.. టాలీవుడ్ కన్నేసిన దుషార విజయన్
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మాళవిక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలాంటి ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడం చాలా కష్టమని ఆమె చెప్పుకురావడం విశేషం.
ఇంటిమేటెడ్ సీన్స్ గురించి మాళవిక మాట్లాడుతూ.. ” సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ చేయడం చాలా కష్టం. ప్రతి సినిమాలో ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు పక్కన ఇంటిమేట్ కో ఆర్డినేటర్ ను నియమిస్తారు. అతని ఆ సీన్స్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తాడు. అంతేకాకుండా నటీనటులు ఇబ్బంది పడకుండా ఉండేలా ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఈ సినిమాలో అలాంటివారు ఎవరు లేరు.
Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పవన్ కు సంబంధించిన ప్రశ్న.. అదిరా పవర్ స్టార్ రేంజ్
సాథియా సాంగ్ చేసేటప్పుడు.. నేను సిద్దాంత్ చాలా కష్టపడ్డాం. సముద్ర తీరం.. చలి ఎక్కువగా ఉంది. ఇది అసలు మేము చేయగలమా అని అనుకున్నాం. చలిని తట్టుకోలేకపోయాం. ఇక ఇదంతా కాదు. ఎలాగైనా ఈ సాంగ్ ను పూర్తిచేయాలి అనుకోని ఏదైతే అది అయ్యిందని దర్శకుడు ఏది చెప్తే అది చేసేసి సాంగ్ ను ఫినిష్ చేసాం.
ఇంటిమేటెడ్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు. నటీనటుల మధ్య సఖ్యత ఉండాలి. మంచి అనువైన వాతావరణం ఉండాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యకాయలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో మాళవిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.