Zebra OTT : టాలీవుడ్ యంగ్ హీరో సత్య దేవ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో తిమ్మరసు అనే కొత్త సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సోలోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సత్యదేవ్ ఈ శుక్రవారం “జీబ్రా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది. సత్యదేవ్ ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ కథ బాగుందని నిన్నటి రివ్యూలలో తెలిసింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయని టాక్. మరి మూవీ ఓటీటీ అప్డేట్ పై ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుందో? ఎప్పుడు వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇక సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ కలిసి నటిస్తున్న మోస్ట్ యాంటీసిపెటెడ్ మల్టీస్టారర్ మూవీ “జీబ్రా”. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ పద్మజ, ఎస్ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, బాల సుందరం కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, జెనీఫర్ పిషినాటో హీరోయిన్ గా నటిస్తున్నారు. “జీబ్రా” మూవీ నవంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. కథ కొత్తగా కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ను చూస్తే..
జీబ్రా మూవీ స్టోరీ థియేటర్లలో బాగా ఆకట్టుకుంది. జీబ్రా మూవీ ఓటిటి రైట్స్ ని అచ్చ తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆహా ఈ మూవీ రైట్స్ కోసం రూ. 5.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే మొత్తానికి ‘జీబ్రా’ మూవీకి మంచి డీల్ కుదిరింది అని చెప్పాలి. ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. త్వరలోనే డేట్ ను ఆహా అనౌన్స్ చేయబోతుంది. ఈ మూవీ నాలుగు వారాలు సక్సెస్ ఫుల్ గా రన్ అయితే వచ్చేనెల క్రిస్మస్ కానుకగా ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనిపై అప్డేట్ రాబోతుందని సమాచారం..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ తిరిగే కథ. ఈ క్రైమ్ కథా చిత్రం తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని బలంగా నమ్ముతున్నారు సత్యదేవ్. సత్య, సత్యదేవ్ కామెడీ టైమింగ్ చాలా బాగుందని తెలుస్తుంది. సత్య మత్తు వదలరా 2 తర్వాత మరోసారి తన మార్క్ ను చూపించాడు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి.