OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను చూస్తూ ప్రేక్షకులు రిలాక్స్ అవుతూ ఉంటారు. కొన్ని మూవీస్ కడుపుబ్బ నవ్విస్తూ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. థియేటర్లలో హల్చల్ చేసి ప్రస్తుతం ఓటీటీ లో ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు “లిటిల్ మాన్” (Little Man). ఒక క్రిమినల్ అయిన మరుగుజ్జు మనిషిని చూసి చిన్న పిల్లాడు అనుకుని, ఒక ఫ్యామిలీ పెంచుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో లిటిల్ మాన్ చేసే విన్యాసాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీలో సిమ్ అనే మరుగుజ్జు మనిషి దొంగతనం కేసులో, జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తాడు. ఇతనికి పెరిసీ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఒక డాన్ దగ్గరికి వెళ్తారు. ఒక డైమండ్ ను దొంగలించి తీసుకురావాలని డాన్ వాళ్లకు ఆర్డర్ వేస్తాడు. ఈ క్రమంలో వాళ్లు ఆ డైమండ్ ని దొంగలించి తీసుకొనివస్తూ ఉంటారు. పోలీసులు లిటిల్ మాన్ ను వెంబడించడంతో, ఆ డైమండ్ ని వెనీసా అనే మహిళ బ్యాగులో వేస్తారు. వెనీసా కు పిల్లలు లేకపోవడంతో భర్త ఆమెతో గోడవపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డైమండ్ ను వెనీసా నుంచి తీసుకురావడానికి లిటిల్ మాన్ ఒక పథకం వేస్తాడు. చూడటానికి ఇతడు చిన్న పిల్లవాడిగా ఉండటంతో ఆ రూపంలోనే వాళ్ళింటికి వెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు లిటిల్ మాన్ ను చూసి, చిన్న పిల్లాడు అనుకుని ఎత్తుకుంటారు. అలాగే అతనికి సపర్యలు చేస్తూ కావలసినవి ఇస్తూ ఉంటారు.
వీళ్లకు పిల్లలు లేకపోవడంతో లిటిల్ మాన్ ను పెంచుకోవాలనుకుంటారు. లిటిల్ మాన్ కి డైపర్ వేసేటప్పుడు అందరూ అక్కడ వింతగా చూస్తారు. ఆ ఇంట్లో అతడు చేసే చేష్టలు చాలా హాస్యాన్ని తెప్పిస్తుంటాయి. అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం, వాళ్లను కామంతో చూడటం వంటివి చేస్తూ ఉంటే, చిన్న పిల్లాడనుకొని సర్దుకుంటారు. ఒకరోజు ఆ డైమండ్ ను తీసుకురాకపోతే ఇద్దరిని చంపేస్తానని లిటిల్ మాన్ ను డాన్ బెదిరిస్తాడు. ఆ డైమండ్ తీసుకోవడానికి లిటిల్ మాన్ చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. చివరికి ఆ డైమండ్ ను వీళ్లు తీసుకు వస్తారా? ఆ డాన్ వీళ్లను ఏమైనా చేస్తాడా? ఆ ఫ్యామిలీకి ఇతడు చిన్నపిల్లవాడు కాదని తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “లిటిల్ మాన్” (Little Man) కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.