Allu Aravind : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది. ఆయన కొడుకులు ఇద్దరు సినిమాల్లో హీరోలుగా రానిస్తున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు. ఇటీవల పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ వరుసగా బాక్సాఫీస్ రికార్డుల ను బ్రేక్ చేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం అంత సక్సెస్ అవ్వలేదు. అడపాదపా సినిమాల తో అలరిస్తున్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. పలు చిత్రాల్లో నటించినా శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన తండ్రి గురించి ఒక సీక్రెట్ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు శిరీష్ హాస్య నటుడు తో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎంత మంది పిల్లలున్నారని అలీ అడిగాడు. తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు.. అదేంటి మొన్నటివరకు ఇద్దరు నుంచి ముగ్గురు అనే నిజం బయటకు వచ్చింది. ఇక ఇప్పుడేమో నలుగురు అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం? ఇంకా ఎంత మందిని దాచి పెట్టాడు అనే వార్తలు ఊపందుకున్నాయి. అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్. తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు. అప్పటికీ శిరీష్ పుట్టలేదట.. అప్పటి నుంచి అన్న గురించి ఎప్పుడు, ఎక్కడా ప్రస్తావించలేదు.. అల్లు అరవింద్ కూడా ఎక్కడా చెప్పుకోలేదు.
అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడుచేసే ధైర్యం చేయలేనని అలీ తెలిపాడు.. ఇప్పటి వరకు ముగ్గురు అనుకొనేవారికి ఇప్పుడు నలుగురు అని తెలుసుకొని షాక్ అవుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.. ఇక అల్లు అరవింద్ నిర్మాత బాగానే సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ రేంజ్ కూడా అందరికి తెలిసిందే. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. కానీ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట వల్ల ఒక ప్రాణం పోయింది. అదే ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. ఈ ఘటన తో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో బెయిల్ వచ్చిన చిక్కులు తప్పలేదు. రోజుకో మలుపు తిరుగుతుంది. ఎక్కడ ఈ వివాదానికి పులుస్టాప్ పడుతుందో చూడాలి..