BigTV English

Taapsee : ఆదాశర్మ తాప్సీలా మారుతుందా.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుందా

Taapsee : ఆదాశర్మ తాప్సీలా మారుతుందా.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుందా


Taapsee : ఆదాశర్మ ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ది కేరళ స్టోరీ సినిమాలో లీడ్ రోల్ చేసిన ఆదా శర్మ.. నేషనల్ వైడ్ టాపిక్‌గా మారింది. ది కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆదాశర్మను చూపించాల్సిందే. విమర్శలో, ప్రశంసలో.. మొత్తానికి ఇన్నాళ్లకు ఆదాశర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈమె ఒక హీరోయిన్ అని గుర్తుచేసుకుంటున్నారు. హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్‌తో కలిసి నటించింది ఆదాశర్మ. పూరీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. నిజానికి పూరీ జగన్నాథ్ ఏ హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేసినా.. మినిమమ్ గ్యారెంటీ కింద నాలుగైదు సినిమాలు చేస్తుంది, హిట్స్ కొడుతుంది. కాని, ఆదా శర్మ విషయంలోనే రివర్స్ అయింది.

అందం, నటనతో బాగానే ఉందనిపించినప్పటికీ.. ఎందుకనో సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే వచ్చాయి తనకి. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో అయితే మరీ దారుణం. ఇక సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అయితే చాలా చిన్న క్యారెక్టర్. ఒక్కసారి అలాంటి క్యారెక్టర్స్ వస్తే ఇక హీరోయిన్‌గా కెరీర్ ఉండదు. అందుకనే, టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ కూడా సేమ్ సీన్. కమాండో సినిమాలో నటించి మెప్పించింది. కాని, అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో… వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది. అక్కడే అడపాదడపా నటిస్తోంది. ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమా చేయడంతో.. మళ్లీ ఆదాశర్మను చూడ్డం మొదలుపెట్టారు జనం.


అయితే, ఆదా శర్మను హీరో పక్కన హీరోయిన్‌గా చూపించడం కంటే.. హీరోయిన్‌ ఓరియెంటెడ్ సినిమాల్లో చూపించాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటి వరకు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇలాంటి అనౌన్స్‌మెంట్ రానప్పటికీ… సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇదే చర్చ జరుగుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇప్పటి వరకు కనిపించిన హీరోయిన్ తాప్సీ. అలాంటి సినిమా చేసి చేసి తాప్సీ అలిసిపోయిందో లేదో గానీ.. తాప్సీని చూసి చూసి ప్రేక్షకులు మాత్రం అలసిపోయారు. దీంతో ఇకపై హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాల్సి వస్తే.. ఆదాశర్మనే వెతుక్కుంటూ వస్తారని చెప్పుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×