E-Paper
Advertisement

Aamir Khan Ghajini Sequel : అమీర్‌ఖాన్ గజినీ సీక్వెల్.. గాసిప్పా, నిజమా?

Aamir Khan Ghajini Sequel : అమీర్‌ఖాన్ గజినీ సీక్వెల్.. గాసిప్పా, నిజమా?
Advertisement

Aamir Khan Ghajini Sequel : గజినీ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు. తమిళంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. తెలుగు డబ్బింగ్ వర్షన్‌లోనూ భయంకరంగా ఆడింది. ఒక విధంగా హీరో సూర్యను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా గజినీ. ఈ సినిమా ఇచ్చిన థ్రిల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు… ఇలా అన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. అప్పటి వరకు ఓ మూస పద్దతిలో వెళ్తున్న సినీ ఇండస్ట్రీని ఉన్నట్టుండి మార్చింది ఈ సినిమా. ప్రేక్షకులు కూడా కథకి బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటి కథను తెలుగు, తమిళంలోనే కాదు.. ఇండియన్ స్క్రీన్ మీద కూడా చూడలేదు. అందుకే, సూపర్ డూపర్ హిట్ అయింది.

Advertisement

గజినీ ఎంత హిట్ అంటే.. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అమీర్ ఖాన్‌కు బాగా నచ్చడంతో గజినీని తెరకెక్కించారు. సేమ్ డైరెక్టర్. హిందీ వర్షన్‌లోనూ మురుగదాస్ డైరెక్ట్ చేశాడు. తమిళంలో హారీస్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తే… హిందీలో ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించాడు. ఇక తెలుగులో సినిమా రిలీజ్ చేసిన అల్లు అరవింద్… హిందీ రీమేక్‌ను అమీర్ ఖాన్‌తో తీశాడు. ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆడింది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా స్టోరీ లైన్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ యాక్టింగ్‌తో ఇరగదీశాడు.

హిందీలో గజినీ సినిమా 2008లో విడుదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. గజినీ సీక్వెల్ తీసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అల్లు అరవింద్ అమీర్ ఖాన్‌తో గజినీ-2 సినిమా తీయబోతున్నారని ఓ టాక్ నడిచింది. అయితే.. అలాంటి ప్రతిపాదనే లేదని అల్లు అరవింద్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అసలు గజినీ సీక్వెల్ అనే మాటే రాలేదని, అమీర్ ఖాన్ కూడా ఆ ఆలోచనతో లేరని చెప్పారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్న అమీర్ ఖాన్… సినిమాలకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటూ చేస్తే.. అది ఒరిజినల్ స్క్రిప్ట్‌తోనే అని స్పష్టం చేశాడు. సో, గజినీ సీక్వెల్ లేనట్టేననేది ప్రస్తుతం కన్ఫార్మ్డ్ న్యూస్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×