BigTV English

Nithin : నితిన్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తారా?

Nithin : నితిన్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపిస్తారా?
Nithin

Nithin : సినీ ఇండ‌స్ట్రీలో నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో చాలా మందికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అభిమానం పీక్స్‌లో ఉంటుంది. అటువంటి వారిలో హీరో నితిన్ ఒక‌రు. ఆయ‌న త‌న సినిమాల్లో ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చూపెట్టం, లేదా ఆయ‌న పాట‌ల‌ను రీమిక్స్ చేసుకుని వాడ‌టం వంటి చేస్తుంటారు. ఇది ఓ ర‌కంగా త‌న అభిమానాన్ని చాటుకోవ‌టం అవుతుంది. మ‌రో ప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఎట్రాక్ చేయ‌ట‌మూ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇప్పుడు మ‌రోసారి నితిన్ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌.


అసలు విషయంలోకి వెళితే, నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి జూనియ‌ర్ సైతాన్ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. ఇందులో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఓ సీన్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా క‌నిపిస్తార‌ట‌. మ‌రి ఆ సీన్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూపిస్తారా? లేక మాట‌ల‌కే ప‌రిమితం అవుతుందా? అనేది ఇప్పుడే చెప్ప‌లేం. ఒకవేళ నిజంగానే నితిన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను త‌న సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తే.. ఆయ‌న కాద‌న‌లేరు. ఎందుకంటే నితిన్ అంటే ప‌వ‌న్‌కు కూడా మంచి అభిమాన‌మే. ఇది ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న రివీల్ చేశారు. అందులో క‌ష్టం కూడా లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఓ లొకేష‌న్‌కు వెళ్లి జ‌స్ట్ ఓ క్లోజ‌ప్ డైలాగ్ చెప్పించుకుని వ‌చ్చి దాన్ని త‌న సినిమాలో కూడా వాడుకోవ‌చ్చు. బాగా వ‌ర్క‌వుట్ కూడా అవుతుంది. మరి దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారో లేదో మరి.

ఇక ఈ సినిమా నితిన్ హీరోగా న‌టిస్తోన్న 32వ మూవీ. రీసెంట్‌గానే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. శ్రేష్ట్ మూవీస్ ఎల్ఎల్‌పి, రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రైట‌ర్, డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్‌లో ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×