BigTV English
Advertisement

Trivikram: పవన్ కి భయపడి బన్నీతో సినిమా క్యాన్సిల్ చేసుకున్న త్రివిక్రమ్.. నిజమేనా.?

Trivikram: పవన్ కి భయపడి బన్నీతో సినిమా క్యాన్సిల్ చేసుకున్న త్రివిక్రమ్.. నిజమేనా.?

Trivikram: మాటల మాంత్రికుడిగా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి.అయితే పుష్ప-2 విడుదలయ్యాక నెక్స్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతూ త్రివిక్రమ్ అట్లీతో సినిమాని కన్ఫామ్ చేశారు. దాంతో త్రివిక్రమ్ ని అల్లు అర్జున్ పక్కన పెట్టడంతో వెంకటేష్ తో సినిమా తీద్దాం అనుకున్నారు.అయితే బన్నీతో సినిమాపై సడన్ త్రివిక్రమ్ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ కాకుండా తన నెక్స్ట్ మూవీ మరో గ్లోబల్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..


బన్నీనీ పక్కన పెట్టిన త్రివిక్రమ్..

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో అలవైకుంఠపురం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ సినిమాలు.వచ్చాయి వీరి కాంబోలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా హిట్టే కావడంతో నెక్స్ట్ వీరి కాంబోలో రాబోయే సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. కానీ పుష్ప-2 తర్వాత బన్నీ అట్లీ మూవీ ఓకే చేశాడు.దాంతో త్రివిక్రమ్ వెంకటేష్ ని వెతుకున్నారు. వెంకీ తో కామెడీ జానర్ లో ఓ సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపించింది.అయితే బన్నీ పక్కన పెట్టడంతో త్రివిక్రమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ మూవీ తీయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాంచరణ్ పెద్ది మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా షూట్ పూర్తవ్వడంతోనే నెక్స్ట్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తారని టాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబోలో వచ్చే మూవీ పవన్ కళ్యాణ్ సమర్పణలో రాబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమాని నిర్మించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.


అసలు కారణం ఏంటంటే..?

అయితే మొదట త్రివిక్రమ్ బన్నీతో అనుకున్నప్పటికీ ఆ పాన్ ఇండియా ప్రాజెక్టు మూలన పడడంతో మరో పాన్ ఇండియా ప్రాజెక్టుతో చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టు సమాచారం. ఇక బన్నీతో త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్ కి భయపడే త్రివిక్రమ్ బన్నీతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే.. 2023 లో వచ్చిన గుంటూరు కారం సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ నుండి సినిమా రాలేదు . దాంతో త్రివిక్రమ్ నుండి వచ్చే నెక్స్ట్ మూవీ పై ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటాయి. కానీ డైరెక్టర్ సుకుమార్ కూడా తన నెక్స్ట్ మూవీ చరణ్ తోనే అని అనౌన్స్ చేశారు. అటు త్రివిక్రమ్ ఇటు సుకుమార్ ఇద్దరు దర్శకులు లైన్లో ఉండడంతో చరణ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది సందిగ్ధంలో పడింది.

Nani New Movie : హిట్‌తో పాటు మరో సినిమాటిక్ యూనివర్స్‌లో నాని… ఈ సారి పరభాష మూవీ

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×