Nani New Movie: హీరో నాని.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు నాని. అలా ఇప్పటివరకు దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్-3 వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ఈ మధ్యకాలంలో నాని చేసే ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు నిర్మాతలకు భారీ కలెక్షన్లు అందిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు నాని బంగారు బాతుగా మారిపోయారు. అయితే అలాంటి నాని గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే నాని త్వరలోనే మలయాళంలో ఒక సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఒక పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
భాష మారుతున్న నాని..
మలయాళం ఇండస్ట్రీలోని వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ లో మిన్నెల్ మురళి, డిటెక్టివ్ ఉజ్వల్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లోకి త్వరలోనే హీరో నాని కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక పోస్ట్ వైరల్ గా మారడంతో చాలామంది జనాలు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మలయాళ సూపర్ హీరో చిత్రం, వీకెండ్ బ్లాక్ బస్టర్ బ్యానర్ పై సోఫియా పాల్ నిర్మించిన మిన్నెల్ మురళి మూవీకి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2021 లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.ఇక ఈ సినిమాలో పిడుగు పాటుకు గురయ్యాక సూపర్ పవర్స్ సంపాదించిన సూపర్ హీరో పాత్రలో టోవినో థామస్ నటించారు. ఇక ఈ మిన్నెల్ మురళి వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఈ మూవీ విడుదలయ్యాక డిటెక్టివ్ ఉజ్జ్వలన్, జాంబి అనే మూవీస్ కూడా రాబోతున్నాయి.
మలయాళం వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్లోకి నాని..
అయితే తాజాగా డిటెక్టివ్ ఉజ్జ్వలన్ మూవీ కూడా విడుదలైంది.ఈ మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్ తన అద్భుతమైన నటనతో అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో జాంబి అనే సినిమా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జాంబీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి నానిని తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే నాని వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే.. ఇప్పటికే హిట్ -3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఇక కేరళలో కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాని మలయాళ వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలియడంతో చాలామంది అభిమానులు సంతోషపడుతున్నారు. ఇక మరొకవైపున అని హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నారు. చిన్న చిన్న సినిమాలే చేస్తున్న మంచి కంటెంట్ ఉండడంతో ఆ సినిమాలకి అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.
Hari Hara Veeramullu : DCM నిబద్ధత… వీరమల్లులో వాటిని దగ్గరుండి డిలీట్ చేయించారు