BigTV English

Allari Naresh : అల్లరి నరేష్ సినిమా కోసం డిఫరెంట్ టైటిల్

Allari Naresh : అల్లరి నరేష్ సినిమా కోసం డిఫరెంట్ టైటిల్

Allari Naresh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. అల్లరి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నరేష్ మొదటి సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలకి కొన్ని సంవత్సరాలు వరకు పరిమితమైపోయారు. కామెడీ సినిమాలు చేస్తున్న తరుణంలో కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్ రోల్స్ నరేష్ కెరీర్ లో పడ్డాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన గమ్యం సినిమాలోని గాలి శీను అనే పాత్ర నరేష్ కు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. కొంతమేరకు నవ్వించి క్లైమాక్స్ లో ఏడిపించడం నరేష్ మాత్రమే సాధ్యమైంది.


నాందితో పంథా మార్చాడు

వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్న తరుణంలో నరేష్ హిట్స్ మీద హిట్స్ అందుకునేవాడు. అల్లరి నరేష్ సినిమా అంటే చాలు మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఆడియన్స్ కూడా థియేటర్ కి వచ్చేసేవాళ్ళు. అయితే ఒక తరుణంలో ఈ తరం రాజేంద్రప్రసాద్ అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. కానీ ఒక టైం తర్వాత అల్లరి నరేష్ సినిమాలు కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టడం మొదలయ్యాయి.


హరీష్ శంకర్ దగ్గర శిష్యరికం చేసిన విజయ్ కనకమేడల నాంది సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. నరేష్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక్కడి నుంచి కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా కాన్సెప్ట్ బేస్ సినిమాలను నమ్ముకొని అల్లరి నరేష్ అడుగులు వేయడం మొదలుపెట్టాడు.  ఇ తరుణంలోనే మహేష్ బాబుతో మహర్షి లాంటి సినిమా కూడా చేశాడు నరేష్.

డిఫరెంట్ టైటిల్ 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అల్లరి నరేష్ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆల్కహాల్ అనే టైటిల్ ను పరిశీలనలో తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకు మెహర్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. మరి కొద్ది రోజుల్లో టైటిల్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అల్లరి నరేష్ సుబ్బు దర్శకత్వంలో నటించిన బచ్చలమల్లి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఆటిట్యూడ్ ను దర్శకుడు బాగా చూపించాడు. బహుశా ఆ సినిమా చూడటం వల్లనే దర్శకుడు ఈ టైటిల్ యాప్ట్ అనిపించిందేమో బహుశా.

Also Read : ముకుల్ దేవ్ మరణానికి కారణం ఇదే… బ్రదర్ రాహుల్ దేవ్ ఏమన్నారంటే

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×