BigTV English
Advertisement

Raja Singh On TTD: తిరుమలలో నిఘా ఎక్కడ? ఐడీ కార్డులు చెక్ చేయలేరా? రాజాసింగ్ ఫైర్..

Raja Singh On TTD: తిరుమలలో నిఘా ఎక్కడ? ఐడీ కార్డులు చెక్ చేయలేరా? రాజాసింగ్ ఫైర్..

Raja Singh On TTD: హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రస్తుతం వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచింది. ఇటీవల తిరుమల కొండపై ముస్లిం వ్యక్తి నమాజ్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హిందూ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, భక్తులు దీనిపై తీవ్ర స్పందన తెలుపుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


తిరుమలలో అన్యమత వీడియో?
తిరుమల కొండపై అన్యమతానికి చెందిన వ్యక్తి ప్రార్థన చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇతర మతాల ప్రదర్శనలు, ప్రార్థనలు నిషిద్ధమని మనకు తెలిసిందే. ఇది కేవలం భక్తి స్థలమే కాదు, నిబంధనలు ఉన్న ప్రాంతం కూడా. తిరుమలలోకి ఎవరైనా ప్రవేశించే ముందు కట్టుబడి ఉండాల్సిన నియమ నిబంధనలున్నాయి. డ్రైవర్ల నుండి భక్తుల వరకు అందరికీ ID కార్డులు చెక్ చేస్తారు. అలాంటి తరుణంలో ఇలా జరుగుతుండటంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

రాజాసింగ్ ఏమన్నారంటే?
ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ, తిరుమలను అపవిత్రం చేయాలన్న కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడుకొండలు కాదు ఐదు కొండలని ప్రచారం జరిగిందన్నారు. జగన్ పాలనలో సైతం తిరుమలపై మళ్లీ కుట్రలు సాగాయన్నారు. విదేశీ మతాలను తిరుమలలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపించారు. ఇదంతా హిందూ ధర్మాన్ని తగ్గించాలన్న కుట్రేనని రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ చేశారు.


అలాగే తిరుమల చెక్‌పోస్టు దగ్గర వాహనాల్ని పూర్తిగా తనిఖీ చేస్తుంటే, ఇలాంటి వ్యక్తి ఎలా ప్రవేశించాడన్నది ప్రశ్నార్థకమని ఆయన మండిపడ్డారు. నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

చట్టపరమైన అంశాలు
తిరుమల ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిపాలిస్తోంది. ఇది హిందూ మత స్థలంగా గుర్తించబడింది. ఇక్కడ తదితర మత ప్రచారాలు, ఆచారాలు, ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఇది 1989లో తెచ్చిన Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act ప్రకారం అమలవుతుంది. దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం TTDకు ఉంది. ఇప్పటికే గతంలో అన్యమత ప్రచార ఘటనల తర్వాత, TTD కఠిన చర్యలు తీసుకుంది. భక్తుల

ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో భక్తుల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. ‘ఇది భక్తుల మనోభావాలను గాయపరచే ఘటన అని పలువురు అభిప్రాయపడ్డారు. తిరుమల వంటి పవిత్ర ప్రాంతం సాంప్రదాయానికి ప్రతీకగా నిలవాలని, దీన్ని ఏ మత రాజకీయాలకు వేదిక చేయకూడదని వారంటున్నారు. ఇక కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశాన్ని మత రాజకీయాల కోణంలో చూడకుండా, చట్టాన్ని అనుసరించి విచారణ జరగాలని సూచిస్తున్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా సరే, అది నిబంధనలకు విరుద్ధమైతే చర్యలు తప్పవని అంటున్నారు.

Also Read: Srisailam: శ్రీశైలం చుట్టూ 8 అద్భుతాలు.. టూర్ వెళితే మిస్ కాకండి!

ఈ ఘటన TTD భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు వేస్తోంది. చెక్ పోస్టుల దగ్గర వాహనాల, వ్యక్తుల తనిఖీ చాలా కఠినంగా ఉంటుందని సమాచారం. అలాంటప్పుడు ఇలా నమాజ్ చేయడానికి అనుమతినిస్తే, భద్రతా లోపమని భావించవచ్చు. ఈ నేపథ్యంలో, మరింత కఠినంగా నియమాలు అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఐడి కార్డులు చెక్ చేయాలి.. రాజాసింగ్
తిరుమలకు వచ్చే ప్రతి వాహన డ్రైవర్ ఐడికార్డులను చెక్ చేయాలని, అన్యమతానికి చెందిన వారైతే తప్పక కొండ కింద ఉంచాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు దృష్టి సారించాలని రాజా సింగ్ కోరారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×