BigTV English
Advertisement

Sree Vishnu: అప్పటినుండి హిట్ లేదు దీనితో కం బ్యాక్ ఇస్తాడు

Sree Vishnu: అప్పటినుండి హిట్ లేదు దీనితో కం బ్యాక్ ఇస్తాడు

Sree Vishnu: బాణం సినిమాలోని ఒక పాత్ర ద్వారా పరిచయమైన నటుడు శ్రీ విష్ణు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో లీడ్ రోల్ లో నటించి, తర్వాత “మెంటల్ మదిలో” అనే సినిమాతో కంప్లీట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పుడు చాలామంది ప్రేక్షకులకి శ్రీ విష్ణు సినిమా అంటే ఖచ్చితంగా వైవిధ్యంగా ఉంటుందని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. శ్రీ విష్ణు చేసిన ప్రతి సినిమా కూడా దేనికి అదే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఒక టైం లో శ్రీ విష్ణు సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ అవ్వటం మొదలుపెట్టాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సామజవరగమన అనే సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ తో పాటు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ సినిమాని మినీ “నువ్వు నాకు నచ్చావ్” అంటూ కూడా కొంతమంది రాయడం మొదలుపెట్టారు.


ఆ తర్వాత హిట్ లేదు

శ్రీ విష్ణు చేసిన సినిమా “ఓం భీమ్ బుష్” ఈ సినిమా కూడా జాతి రత్నాలు టైప్ లో మంచి ఫన్ గా ఉండబోతుందని చాలామంది ఊహించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా సరైన ఆదరణ లభించలేదు. ఆ తర్వాత శ్రీ విష్ణు చేసిన మరో క్రేజీ ప్రాజెక్ట్ స్క్వాగ్. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్గా నిలిచిన కూడా చాలామంది ఆడియన్స్ కి అర్థం కాకుండా పోయింది. కొంతమంది ఈ సినిమాను ఓటీటీలో చూసి ఇంత మంచి సినిమాను ఎలా ఫెయిల్ చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. వీరి కాంబినేషన్లో ఇదివరకే రాజరాజ చోర అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా కూడా ఆ సినిమాకి మంచి ప్రశంసలు లభించాయి. టెక్నికల్ గా ఆ సినిమాను హసిత్ డిజైన్ చేసిన విధానం చాలామందికి నచ్చింది.


కం బ్యాక్ ఇస్తాడా.?

ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు నటించిన సినిమా సింగిల్. ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి అవి ఉండటం సహజం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇక రిలీజ్ అయిన ట్రైలర్ కూడా పరవాలేదు అనిపించుకునేలా ఉంది. అయితే ఆడియన్స్ కి ఇప్పుడు పరవాలేదు అనుకునే కాన్సెప్ట్లు అంతగా ఎక్కట్లేదు. కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఉండబోతుంది అని అనిపిస్తే కానీ థియేటర్కు రాని పరిస్థితి. శ్రీ విష్ణు టైమింగ్ కి సరిపడా కామెడీ పంచులు చాలా ఉన్నాయి. అవి థియేటర్లో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో, ఇక ఈ సినిమాతో శ్రీ విష్ణు కం బ్యాక్ ఇస్తాడో లేదో మే 9న తెలియనుంది.

Also Read : Single Movie : తండేల్ రేంజ్ లో ప్రమోషన్ చేయనున్నారా.?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×