E-Paper
Advertisement

Single Movie : తండేల్ రేంజ్ లో ప్రమోషన్ చేయనున్నారా.?

Single Movie : తండేల్ రేంజ్ లో ప్రమోషన్ చేయనున్నారా.?
Advertisement

Single Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఎన్నో అద్భుతమైన సినిమాలను గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ కి అనుసంధానంగా గీత ఆర్ట్స్ టు బ్యానర్ నిర్మించిన సంగతి కూడా తెలిసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన 100% లవ్ అనే సినిమాతో ఈ బ్యానర్ మొదలైంది. అయితే ఈ బ్యానర్ లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. గీత ఆర్ట్స్ కేవలం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా మంచి మంచి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అలా గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేశాయి. ముఖ్యంగా కాంతారా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం గీత ఆర్ట్స్ బ్యానర్లు తెరకెక్కిన సినిమా సింగిల్.

పగడ్బందీగా ప్లానింగ్

Advertisement

శ్రీ విష్ణు సింగిల్ సినిమా కోసం గీత ఆర్ట్స్ బ్యానర్ చాలా పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేశారు. గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పకడ్బందీగా చేసిన కూడా అల్లు అరవింద్ గారు మరియు టీమ్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఆ సినిమాను ఇప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించడం సహజం. అయితే ఆ సినిమా ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందేమో అనేది ఆలోచించాల్సిన పరిస్థితి.

Also Read : PuriSethupathi : మాస్టర్ పీసా.? అప్పుడే డిసైడ్ చేశారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి.

Advertisement

తండేల్ రేంజ్ ప్రమోషన్

చందు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అలా నేను నాగచైతన్య కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అలానే ఈ సినిమా మీద విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అద్భుతంగా ప్లాన్ చేశారు బన్నివాసు. అలానే ఇప్పుడు సింగిల్ సినిమా కూడా ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తారేమో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ పూర్తిస్థాయిలో విపరీతంగా ఆకట్టుకోకపోయినా కూడా పరవాలేదు అనిపించుకునేలా ఉంది. కానీ ఆడియన్స్ థియేటర్ కి రావడానికి ఇది సరిపోదు. మరి దీనిని ఏ విధంగా ప్లాన్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తారని వేచి చూడాలి.

Also Read : 19 Years For Pokiri : చాలామంది ఈ సినిమా ఆడదు అన్నారు, కట్ చేస్తే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×