భార్యాభర్తల జీవితంలో ఏకాంత క్షణాలే ముఖ్యమైనవి. ఆ ఏకాంత క్షణంలో వారు ఎంతగా దగ్గర అయితే వారి మనసులు కూడా అంతే దగ్గరవుతాయి. బంధాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన అంశాల్లో దాంపత్య జీవితం కూడా ఒకటి. ఒత్తిడి ఆరోగ్య సమస్యలను అధిగమించే శక్తి ఆ ఏకాంత క్షణాలు అందిస్తాయి.
ఆరోగ్య సమస్యల వల్ల లేదా ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి వల్ల, దంపతుల మధ్య ఏకాంతక్షణాల్లో దొరికే ఆనందం కొంతమేర తగ్గిపోతుంది. అయితే ఆ ఆనందాన్ని రెట్టింపు చేయాలంటే ఆహారపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం పాలల్లో కొన్ని రకాల పదార్థాలు కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇవి శారీరక, మానసిక శక్తిని ఉత్సాహాన్ని పెంచుతాయి. ఏకాంత సమయంలో లైంగిక ప్రక్రియను ఉత్తేజంగా మారుస్తాయి. పాలల్లో ఎలాంటి ఆహార పదార్థాలు కలిపి తీసుకోవాలో తెలుసుకోండి.
బాదం
బాదంలో విటమిన్ ఈ, జింక్, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి శక్తిని పెంచుతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. కాబట్టి పాలల్లో బాదంపొడిని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. లేదా ఐదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం అయ్యాక వాటిని పేస్టులా చేసి గ్లాసు వెచ్చని పాలలో కలిపి తాగండి. అలాగే రుచి కోసం చిటికెడు యాలకుల పొడిని లేదా తేనెను కూడా కలిపి తాగవచ్చు. ఈ డ్రింకును సాయంత్రం లేదా రాత్రి తాగితే మంచిది.
కుంకుమపువ్వు
కుంకుమపువ్వు ఆయుర్వేదంలో శక్తివంతమైన ఔషధంగా చెబుతారు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ మూడ్ ను ఉత్సాహబరుస్తుంది. ఇక ఏకాంత కలయికకు కుంకుమ పువ్వు చేసే సహాయం కూడా ఎంతో ఎక్కువ. రెండు మూడు కుంకుమపువ్వు రెబ్బలను తీసుకొని ఒక గ్లాసు వెచ్చని పాలలో వేసి పది నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత తాగేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ పాలన తాగితే ఎంతో మంచిది.
అశ్వగంధ
అన్ని ఆయుర్వేద షాపుల్లో అశ్వగంధ లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి… శక్తిని పెంచే ఆయుర్వేద ఔషధం శారీరక సామర్ధ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దంపతుల ఏకాంత కలయికలో ఆనందాన్ని పెంచడంలో అశ్వగంధ ముందుంటుంది. ఒక గ్లాసు వెచ్చని పాలు తీసుకొని ఒక స్పూను అశ్వగంధ పొడిని వేసి బాగా కలపండి. ఒక స్పూను తేనె కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి తాగేందుకు ప్రయత్నించండి. అలా అని అశ్వగంధను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాకే అశ్వగంధను తీసుకోవడం మంచిది.
యాలకుల పొడి
యాలకులు శరీరానికి రక్తప్రసరణ మెరుగుపరిచే మంచి సుగంధ ద్రవ్యం. ఇది ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ కలయిక ఆనందంగా సాగాలంటే పాలల్లో యాలకుల పొడిగా కలుపుకొని తాగడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు గ్లాస్ వచ్చిన వాళ్లలో చిటికెడు యాలకుల పొడి కలిపి రాత్రి పూట తాగండి చాలు. కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది.
తేనె
సహజసిద్ధమైన శక్తివంతమైన ఆహారం తేనె. ఇది తాగిన వెంటనే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలాగే శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. గ్లాస్ వెచ్చని పాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే ఎంతో మంచిది. దానిలో దాల్చిన చెక్క పొడి కూడా చిటికెడు వేసుకుంటే శరీరం మరింత ఉత్సాహంగా ఉంటుంది.
పైన పేర్కొన్న పదార్థాలన్నీ కూడా శరీరానికి శక్తిని అందించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవన్నీ కూడా లైంగిక ప్రక్రియకు అవసరమైన క్రియలు.ఒత్తిడి ఉంటే మీరు లైంగిక చర్యను ఆనందించలేరు. అలాగే రక్తప్రసరణ శరీరం మొత్తం జరగకపోయినా మీలో ఉత్సాహం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగా పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గడం శరీరంలో శక్తి పెరగడం, రక్త ప్రసరణ మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీ లైంగిక జీవితాన్ని ఆనందంగా మారుస్తాయి.
అయితే డయాబెటిస్, అలెర్జీలు వంటి సమస్యలతో బాధపడేవారు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు బారిన పడినవారు వైద్యుడిని సంప్రదించాకే ఇలాంటి డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకోవాలి.