Sridevi:అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి నేడు మన మధ్య లేకపోయినా ఆమె నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికే ఆమెను సజీవంగానే ఉంచాయి. తెలుగు, తమిళ్,హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేసింది. తెలుగులో ఎన్టీఆర్ (NTR), ఏఎన్ఆర్(ANR),చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్(Venkatesh )వంటి స్టార్ హీరోల సరసన నటించి అలరించిన ఈమె బాలీవుడ్ లో కూడా స్టార్ స్టేటస్ అందుకుంది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో తొలి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే అందం, అభినయంతో పాటు నటన, చలాకీతనంతో మంచి పేరు సొంతం చేసుకుంది.
శ్రీదేవిపై రచయిత ఘాటు వ్యాఖ్యలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఈమె ప్రస్థానం బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్ గా ఎదిగేలా చేసింది. ఇకపోతే అనూహ్యంగా దుబాయిలో మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది శ్రీదేవి. ఈమె మరణం అభిమానులకు తీరని లోటు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరణం పై ప్రముఖ టాలీవుడ్ సీనియర్ రచయిత తోటపల్లి మధు (Thotapalli Madhu)ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
శ్రీదేవి అలాంటిది..
సినీ ప్రముఖులు తోటపల్లి మధు శ్రీదేవి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి ప్రతిరోజు తాగుతుండేదని ఆయన చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.” సినిమా అనేది రంగుల ప్రపంచం. ఒక్కసారి మేకప్ వేసుకుంటే అందులో నుండీ బయటపడడం కష్టం. అలాంటివారిలో శ్రీదేవి కూడా ఒకరు. 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగానే ఆవిడ మరణించింది. ఆవిడకి హైబీపీ, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. అలాగే ఆమె తన అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది. డైట్ అంటూ తక్కువగా తినేది. ముఖ్యంగా అందంగా ఉండడానికి ఎక్కువ డ్రింక్ తీసుకునేది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తోటపల్లి మధు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు రచయిత తోట మధు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మనిషి పైన ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీ దేవి అభిమానుల ఆగ్రహానికి బలవుతున్న తోటపల్లి మధు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
రచయిత గానే కాదు విలన్ గా కూడా గుర్తింపు..
తోటపల్లి మధు విషయానికి వస్తే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన దేవాంతకుడు సినిమా ద్వారా రచయితగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దాదాపు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించిన ఈయన, 45 సినిమాలలో విలన్ పాత్రలు కూడా పోషించారు. ఇకపోతే 2024లో వచ్చిన పారిజాతపర్వం సినిమాలో నటుడిగా నటించారు. అంతేకాదు కామెడీ కూడా పండిస్తూ ప్రేక్షకులను అలరించారు మధు. ఒకవైపు నటుడిగా కమిడియన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఇలా ఇప్పుడు శ్రీదేవి పై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు.