E-Paper
Advertisement

Article 370 Box Office Collection Day 2: ‘ఆర్టికల్ 370’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

Article 370 Box Office Collection Day 2: ‘ఆర్టికల్ 370’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Advertisement

Article 370 Day 2 Collections: బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. ఇందులో భారీ తారాగణం నటించింది. ప్రియమణి, అరుణ్ గోవిల్, కిరణ్ కార్మాకర్ వంటి నటీ నటులు కీలక పాత్ర పోషించారు.

ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మంచి టాక్ అందుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద్, అవినీతి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో యావీ గౌతమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement

విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నట్లు తెలుస్తోంది.

Read More: యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Advertisement

ఈ మూవీ ఫస్ట్ డే దాదాపు రూ.5.25 కోట్లు, నిర్మాత ప్రకారం.. రూ.6.12 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండవ రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్లను వసూళు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల ఇండియా నెట్ బాక్సాఫీసు కలెక్షన్స్ చూసుకుంటే.. మొదటి రోజు రూ.5.9 కోట్లు, రెండవ రోజు రూ.7.6 కోట్లు మొత్తం రూ.13 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లో మరింత వసూళ్లు కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

కాగా ఈ మూవీ రిలీజ్ రోజున భారతదేశంలో దాదాపు 1500 థియేటర్లలో 2000 స్క్రీన్‌లలో ప్రదర్శితమైంది. ఈ మూవీ థియేటర్ అనంతరం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Read More: వరుణ్ తేజ్ – లావణ్య పూజలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి..?

అయితే ఏ ఓటీటీలోకి వస్తుందో ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×