BigTV English

Varun Tej – Lavanya: వరుణ్ తేజ్ – లావణ్య పూజలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి?

Varun Tej – Lavanya: వరుణ్ తేజ్ – లావణ్య పూజలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి?


Varun Tej – Lavanya: టాలీవుడ్‌లోని క్యూట్ లవ్ కపుల్స్‌లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జోడి ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు కెరీర్ పరంగా కూడా చాలా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఈ లవ్ కపుల్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగానే లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘మిస్ పర్‌ఫెక్ట్’ తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్‌స్టార్‌లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో లావణ్య పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. పెద్దగా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.


ఈ క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య దంపతులు ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి తల్లిని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక లావణ్య కూడా తన ఓ ఫోటో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరపున ప్రచారం.. వరుణ్‌ తేజ్‌ క్లారిటీ!

దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మంచి హిట్ అందుకోవాలని గోదావరి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లేకపోతే మరేదైనా కారణం ఉందా? అంటూ తెగ గుస గుసలాడేసుకుంటున్నారు.

ఇకపోతే వరుణ్‌తేజ్ నటిస్తోన్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజైన ట్రైలర్ అందరి అంచనాలను మరింత పెంచేసింది.

Read More: ఆ అగ్రిమెంట్ ప్రకారమే వరుణ్ – లావణ్య పెళ్లి జరిగిందా..?

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాను చిత్రయూనిట్ వేగవంతం చేసింది. ఈ మూవీపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరగనున్న ఈ వేడుకకు పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×