BigTV English

War2: తెలుగులో వార్ 2 లేనట్టేనా…వారి ఆశలు నిరాశలేనా?

War2: తెలుగులో వార్ 2 లేనట్టేనా…వారి ఆశలు నిరాశలేనా?
Advertisement

War 2: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)హీరోగా 2019వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వార్. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం YRF స్పై యూనివర్స్‌లో మూడవ భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా, వాణి కపూర్ ,అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించారు. ఇలా 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


స్పై ఏజెంట్…

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 (War 2) చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ ఒక స్పై ఏజెంట్ గా నటించబోతున్నారని సమాచారం. ఇక హీరోయిన్ పాత్రలో నటి కియారా అద్వానీ(Kiayara Advani) సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


సొంతంగా విడుదల….

శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా పై ఇటు తెలుగులో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీ స్థాయిలోని జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో తెలుగు వారికి నిర్మాతలు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి.

వార్ 2 సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగం అయిన నేపథ్యంలో తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది దీంతో ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం కోసం బయ్యర్లు కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బయ్యర్లకు మాత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films)ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమాని బయ్యర్ల చేతికి వెళ్లకుండా తెలుగులో ఓన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా తెలుగులో భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలోనే నిర్మాతలు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈ చిత్రాన్ని బయ్యర్లు కొనుగోలు చేసి లాభాలు అందుకోవాలని ఆశిస్తున్న తరుణంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బయ్యర్ల ఆశలపై నీరు చల్లడంతో వారి ఆశలు కాస్త నిరాశలుగానే మిగిలాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×