Mani Ratnam: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. మణిరత్నం అంటేనే ఒక బ్రాండ్. మణిరత్నం తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ గా విడుదలయ్యాయి. తమిళ్లో ఆ లవ్ స్టోరీస్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మణిరత్నంని చాలామంది లవ్ గురు అని పిలుస్తూ ఉంటారు. అద్భుతమైన లవ్ స్టోరీస్ తీయడంలో మణిరత్నం స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన దిగ్గజ దర్శకులు ఇప్పుడంతా స్క్రాప్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్తున్న ఆడియన్ కి నిరాశను మాత్రమే మిగిలిస్తున్నారు. ఇక రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మణిరత్నం ఏంటి ఇలా తీశాడు అని అనిపించేలా ఆ సినిమా ఉంది.
రిటైర్ అయిపోవాల్సిందే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందనతో కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేయాలి అని ప్రకాష్ రాజును ఉద్దేశించి రావు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు చాలామంది దర్శకులకు ఆ డైలాగ్ అన్వయించుకోవచ్చు. ఒకప్పుడు మంచి దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన శంకర్ భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి సినిమాలతో ప్రేక్షకులుకు మరింత బోర్ కొట్టించాడు. ఏ మాత్రం ఆసక్తిని లేకుండా ఆ రెండు సినిమాలు నడిచాయి. అంతేకాకుండా శంకర్ ఏంటి ఇంత దారుణంగా తీశాడు అని అనిపించుకున్నాడు. దాదాపు మణిరత్నం పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది. ఇంకా సినిమాలు ఆపేయడం బెటర్ అనేది కొంతమంది మణిరత్నం అభిమానుల ఆలోచన.
యంగ్ డైరెక్టర్స్ ఫామ్
ఇకపోతే చాలామంది సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్ మంచి హిట్ సినిమాలు ఇస్తున్నారు. శంకర్ మణిరత్నం వంటి దర్శకులు కమల్ హాసన్ కు ప్రస్తుతం డిజాస్టర్ సినిమాలు ఇచ్చారు. కానీ లోకేష్ కనకరాజు మాత్రం విక్రమ్ రూపంలో అద్భుతమైన సక్సెస్ ఇచ్చి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చేలా చేశాడు. ఇక ప్రస్తుతం చాలామంది యంగ్ డైరెక్టర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నారు. చాలామంది సీనియర్ దర్శకులు ఉన్న పేరును కూడా చెత్త సినిమాలు చేస్తూ పాడు చేసుకుంటున్నారు. రాంగోపాల్ వర్మల ఇంకా డిజాస్టర్ సినిమాలు చేసి పేరు పోగొట్టుకోవడం కంటే ఇప్పుడే మణిరత్నం రిటైర్ అవ్వడం చాలా మంచిది అనేది సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్.
Also Read : Aditi Shankar: పాపం ఆ దర్శకుడిని బాడీగార్డ్ అని అనుకుంది