Yashoda Twitter Review : సమంత యశోదా మూవీ ఈరోజు థియేటర్లో రిలీజ్ అయింది. ఎంగేజింగ్ థ్రిల్లర్.. సమంత యాక్టింగ్ సూపర్ అంటూ ట్విట్టర్లో రివ్యూస్ పెడుతున్నారు నెటిజన్స్. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ ఉందని బయటపెట్టడం.. తరువాత ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయి ఏడవడం.. మొత్తం సినీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మయోసైటిస్ తరువాత సమయంత అసలు ఎలా ఉంది.. సినిమాల్లో ఆమె ఎలా కనబడుతుంది..లాంటి విషయాలు చాలా మందికి ఆసక్తిగా మారాయి. సమంత భారీ కట్‌ఔట్‌లు థియేటర్ వద్ద దర్శనమిచ్చాయి. దీనిపై సామ్ స్పందిస్తూ.. కింది విధంగా ట్వీట్ చేసింది.
యశోదా మూవీ వుమెన్ ఓరియంటెడ్ ఫిలిం కావడం..అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కడంతో అన్ని రకాల ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి తహతహలాడుతున్నారు. యశోదా సినిమా చేసిన ప్రేక్షకులు ఏమటున్నారంటే..సినిమాకు సమంత లైఫ్‌లైన్‌గా ఉందని ట్వీట్ చేస్తున్నారు. బీజీఎం అద్భుతంగా వచ్చిందంటున్నారు. విజువల, యాక్షన్ సీన్స్ సూపర్బ్ అంటున్నారు. కాన్సెప్ట్ కూడా కొత్తగా బాగుందట. సినిమాలో సెకండ్ హాఫ్ చాలా బాంగుందని రెస్పాన్స్ వస్తోంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుందని అంటున్నారు. అయితే మొదటి 20 నిమిషాలు సినిమా కొంత బోర్ కొడుతుందని అంటన్నారు.