BigTV English
Advertisement

NASA : ముచ్చటగా మూడోసారి ఆర్టెమిస్ 1 ప్రయోగాన్ని వాయిదా వేసిన నాసా

NASA : ముచ్చటగా మూడోసారి ఆర్టెమిస్ 1 ప్రయోగాన్ని వాయిదా వేసిన నాసా


NASA : ఆర్టెమిస్ 1 ప్రయోగాన్ని నాసా ముచ్చటగా మూడోసారి వాయిదా వేసింది. ఈ నెల 14న ఆర్టిమస్ 1ని ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ఇంతలోనే ఫ్లోరిడా తీరానికి నికోల్ హారికేన్ ముప్పు ముంచుకు రానుండడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ఈ నెల 16న ప్రయోగిస్తామని వెల్లడించింది. హారికేన్ వల్ల ప్రయోగానికి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన నాసా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు హారికేన్ కారణంగా స్పేస్ లాంచ్ సిస్టమ్-ఎస్ఎల్ఎస్ రాకెట్ దెబ్బతినకుండా జాగ్రత్తపడేందుకు లాంగర్ కు తరలించనుంది. ఈలోపు ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి తిరిగి వచ్చేలా సెలవులు ఇచ్చినట్లు తెలిపింది. తొలుత ఆగస్టు 29న లాంచ్ చేయాలని భావించింది నాసా. కానీ అప్పుడు హరీకేన్ ముప్పుతోపాటు ఇంధనం లీకేజీ వల్ల వాయిదా వేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న ప్రయోగానికి సిద్ధమైంది. కానీ లిక్విడ్ హైడ్రోజన్ లీక్ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేసింది. ప్రయోగాన్ని నవంబర్ 14కు వాయిదా వేసింది. దీంతో ముచ్చటగా మూడోసారి వాయిదాపడినట్లయింది.
ఇంతకీ ఏంటీ ఆర్టెమిస్ 1 ప్రయోగం?
చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నాసా తలపెట్టిందే ఆర్టెమిస్ 1 ప్రయోగం. అంటే ముందుగా ఓరియన్ క్యాప్సూల్ ను మానవరహితంగా ప్రయోగిస్తుంది. ఇది చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి వస్తుంది. ఆర్టెమిస్ 1 ద్వారా శక్తిమంతమైన రాకెట్ తోసహా వ్యోమనౌకలను నింగిలోకి పంపడానికి ప్రణాళికలు సిద్ధిం చేసింది నాసా. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది సక్సెస్ అయితే మరో రెండు ప్రయోగాలను చేపట్టనుంది. 2024 ఆర్టెమిస్ 2, 2025లో ఆర్టెమిస్ 3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×