Pushpa2 : ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 ఫీవర్ పట్టుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న( Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ అడియన్స్ ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ మూవీ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేసింది. ఈ ట్రైలర్ తో సినిమా భారీ విజయాన్ని అంటుంకుంటుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ట్రైలర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ పుష్పరాజ్ అంటే వైల్డ్‌ఫైర్ అనుకుంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకువచ్చారు. దీంతో ఈ ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్‌తో సౌత్ ఇండియాలో బన్నీ ఓ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా 40 మిలియన్ల వీక్షణలు సాధించిన తెలుగు ట్రైలర్‌గా పుష్ప2 నిలిచింది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డు అంటూ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. ‘ఈ పుష్పరాజ్.. రికార్డుల పుస్తకాలను కూడా రూల్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండు రోజులు పూర్తి అయిన కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.. సినిమా భారీ హిట్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామాను మొదలెట్టేసారు.
ఇదిలా ఉండగా.. ఈ ట్రైలర్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వెలుగు చూసింది. అదేంటంటే ఈ ట్రైలర్ లో వైసీపీ జగన్ ను డైలాగు ను కాపీ కొట్టారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జగన్ ఓ సందర్భంలో మాట్లాడిన సప్తసముద్రాలు అవతల ఉన్నా తీసుకొస్తాము అని చెప్పిన పాపులర్ డైలాగ్ ను ఓ ఎడిటెడ్ వీడియోని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ ట్రైలర్ లో బన్నీ.. నాకు కావాల్సింది ఏడుకొండల పై ఉన్నా.. ఏడు సముద్రాలు దాటి ఉన్నా.. పోయి తెచ్చుకునేదే ఈ పుష్ప స్టైల్ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ విసురుతాడు..ఈ రెండు డైలాగ్స్ ని క్లబ్ చేసి జగన్‌ని, అల్లు అర్జున్‌ని కలుపుతూ వైసిపి ఫ్యాన్స్ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక సినిమా ఏ రేంజ్లో హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..