BigTV English

Bigg Boss 8 Telugu Promo: తేజ చెంపపై యష్మీ ముద్దు.. అందరూ కలిసి ఎంత మోసం చేశార్రా!

Bigg Boss 8 Telugu Promo: తేజ చెంపపై యష్మీ ముద్దు.. అందరూ కలిసి ఎంత మోసం చేశార్రా!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటివరకు చీఫ్స్, మెగా చీఫ్స్‌గా ఎంతోమంది ఆ పదవిని ఎంజాయ్ చేశారు. గతవారం ముగిసిన మెగా చీఫ్ పోటీలో అవినాష్ రెండోసారి ఆ పదవిని అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక బిగ్ బాస్ 8లో చివరి మెగా చీఫ్ ఎవరు అవుతారో తెలుసుకోవడానికి పోటీ మొదలయ్యింది. మెగా చీఫ్ అవ్వడం కంటే ముందు మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరు అవుతారు అనేదాని కోసం పోటీ మొదలయ్యింది. ఇక పోటీ మొదలయ్యి కంటెస్టెంట్స్ అంతా దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా టాస్క్ ఆడడం మొదలుపెట్టారు. అదే సమయంలో టేస్టీ తేజతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు. యష్మీతో తేజకు ముద్దు పెట్టిస్తామని చెప్పి ఆశపెట్టారు.


షర్ట్‌లెస్‌గా చూడాలి

వాష్‌రూమ్ ఏరియాలో ఎవరికీ తెలియకుండా పడుకున్నాడు టేస్టీ తేజ. అవినాష్, ప్రేరణ వచ్చి తనను లేపకుండా అలాగే చూస్తూ ఉన్నారు. అప్పుడే కుక్కలు అరవడంతో తను లేచాడు. అవినాష్ మెగా చీఫ్ కావడంతో తేజ పడుకున్నందుకు పనిష్మెంట్ ఇస్తానన్నాడు. ప్రేరణ అయితే తేజను షర్ట్‌లెస్‌గా చూడాలని పనిష్మెంట్ ఇస్తానని చెప్పింది. అది విని తేజ షాకయ్యి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని సరదాగా అడిగాడు. యష్మీ కూడా ఈ విషయంలో ఎంకరేజ్ చేసింది. ‘‘షర్ట్‌లెస్ అయితే ఏంటి. తేజ నువ్వు హ్యాండ్‌సమ్‌‌’’ అని చెప్పింది. తను షర్ట్‌లెస్‌గా ఉంటే యష్మీ ముద్దుపెడుతుందని తేజకు ఆశపెట్టింది ప్రేరణ. దానికోసం పనిష్మెంట్‌కు ఒప్పుకున్నాడు.


Also Read: ఆఖరి మెగా చీఫ్.. కంటెస్టెంట్స్ మధ్య అగ్గి రాజేసిన బిగ్ బాస్..!

పనిష్మెంట్ ఓకే

‘‘షర్ట్‌లెస్‌గా స్విమ్మింగ్ పూల్‌లో దూకిన తర్వాత ముద్దిస్తా’’ అని యష్మీ కూడా ఒప్పుకుంది. ‘‘స్విమ్మింగ్ పూల్‌లో దూకి మరీ ఇస్తావా’’ అని ఎగ్జైట్ అయ్యాడు తేజ. అలా అయితే నేను కూడా ఆడతానని అవినాష్ అన్నాడు. వెంటనే అను ఫోటోను తీసుకొచ్చి తన గురించి గుర్తుచేశారు కంటెస్టెంట్స్. పనిష్మెంట్ ఒప్పుకున్న తేజ.. షర్ట్ విప్పేసి స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. అందరూ కలిసి తేజను ఎంకరేజ్ చేశారు. మధ్యలోనే కిస్ క్యాన్సల్ అంటూ తేజకు షాకిచ్చింది యష్మీ. తను ఇవ్వకపోతే నేను ఇస్తా అని స్టేట్‌మెంట్ ఇచ్చింది రోహిణి. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి అంటూ తేజ రిక్వెస్ట్ చేశాడు.

అంతా మోసం

ఫైనల్‌గా టేస్టీ తేజ పనిష్మెంట్ పూర్తిచేశాడు. యష్మీ ముద్దు పెట్టాలంటే తేజ కళ్లు మూసుకోవాలని అందరూ కండీషన్ పెట్టారు. ప్రేరణను నమ్మి కళ్లు మూసుకున్న తర్వాత యష్మీ స్థానంలో నిఖిల్ వచ్చి ముద్దుపెట్టాడు. కళ్లు తెరిచే సమయానికి యష్మీ పక్కనే ఉండడంతో ఆ ముద్దు తనే పెట్టిందని నమ్మాడు తేజ. ఇక తన ఆనందానికి హద్దులు లేవు. ఫన్ అంతా ముగిసిన తర్వాత మెగా చీఫ్ కంటెండర్ కోసం మళ్లీ పోటీ మొదలయ్యింది. టేస్టీ తేజ టీషర్ట్ హౌస్‌లోకి రాగానే దానిని తీసుకోవడానికి కంటెస్టెంట్స్ అంతా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొందరు తనకు సపోర్ట్ చేస్తే.. కొందరు మాత్రం తను గెలవకూడదని అనుకున్నారు. మొత్తానికి బజర్ మోగేవరకు టీషర్ట్ కాపాడుకున్నందుకు టేస్టీ తేజ మెగా చీఫ్ కంటెండర్ అయ్యాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×