HBD Naga Shourya:నాగశౌర్య మల్పూరి ( Naga Shourya malpuri).. 1989 జనవరి 22వ తేదీన శివలింగ ప్రసాద్, ఉషా మల్పూరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జన్మించారు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న నాగశౌర్య.. అలా మొదటిసారి 2011లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈయన మొదటి సినిమా ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’. జాతీయ బహుమతిని పొందిన తెలుగు సినిమా ‘చందమామ కథలు’ లో హాస్య పాత్రను నాగశౌర్య పోషించాడు. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక 2014లో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలో నటించి, ప్రేక్షకులను అలరించిన ఈయన, 2015లో ‘జాదూగాడు’ సినిమా చేశాడు. ఆ తర్వాత అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద, నీ జతలేక, కథలో రాజకుమారి ఇలా పలు చిత్రాలు చేశారు. కానీ ప్రేక్షకులను మాత్రం స్టార్ స్టేటస్ హోదాలో మెప్పించలేకపోయారు.
అలా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఈయనకు మాత్రం సరైన కమర్షియల్ సక్సెస్ లభించడం లేదు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈరోజు నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం, సంపాదించిన ఆస్తులు అన్నీ వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నాగశౌర్య వ్యక్తిగత జీవితం..
నాగశౌర్య బెంగళూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి (Anusha Shetty)ని 2022 నవంబర్ 11న వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా కథనాల ప్రకారం, నాగశౌర్యకు అనూష శెట్టి నుండి రూ.50 కోట్ల వరకు కట్నం లభించిందని సమాచారం. ముఖ్యంగా అనూష శెట్టి ఆస్తులు కూడా బాగానే ఉండడంతో నాగశౌర్య మామ వాటిని కూడా అల్లుడు పేరు మీద రాసేసారట. అప్పట్లో ఈ విషయాలు చాలా వైరల్ గా కూడా మారాయి. ముఖ్యంగా వివాహానికి వచ్చిన అతిథులకు రాచరికపు స్టైల్ లో భోజనాలు వడ్డించారు. అంతేకాదు నాగశౌర్య, అనూష దంపతులకు ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే.
నాగశౌర్య ఆస్తుల వివరాలు..
నాగశౌర్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 4నుండి రూ. 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మోడల్గా తన ప్రయాణం మొదలుపెట్టిన నాగశౌర్య మంచి సింగర్ కూడా. అంతేకాదు ఫిలిం ప్రొడ్యూసర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తున్న ఈయన నెలకు దాదాపు కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నాగశౌర్య సుమారుగా రూ.90 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు అత్యంత సుందరంగా అద్భుతంగా డిజైన్ చేయించుకున్న ఖరీదైన బంగ్లా కూడా ఈయన సొంతం దీని విలువ సుమారుగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
నాగశౌర్య కారు కలెక్షన్స్..
నాగశౌర్య దగ్గర ఉన్న కారు కలెక్షన్ విషయానికి వస్తే.. బెంజ్ జి ఎల్ ఈ క్లాస్, పోర్సే, లంబోర్గిని, ఆడి ఏ సిక్స్, హోండా సిటీ వంటి లగ్జరీ ఖరీదైన కార్లు ఈయన సొంతం.