Satyabhama Today Episode January 22nd : నిన్నటి ఎపిసోడ్ లో… అదృశ్య శక్తి ఎవరిని కృష్ణ ఒక ఆట ఆడుకుంటుంది సత్య. నాకు రాత్రి ఎంతగా నిద్రపోవాలనుకున్న నిద్ర పట్టలేదు ఆదృశ శక్తి ఎవరో తెలుసుకోవాలని నాకు వెనుక నుండి ఇంత సపోర్ట్ చేసిన అతన్ని నేను చూడాలని మదనపడ్డాను. అతను నాకు మెసేజ్ చేశాడు. దాంతోనే నువ్వు ఊపిరి పీల్చుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడని అతనితో మాట్లాడుతుంది కానీ క్రిష్ అవతలి ఎవరూ లేరని అనుకుంటున్నాడు.. సత్య అవతల మాట్లాడే వాళ్ళు ఎవరో వినాలని స్పీకర్ ఆన్ చేసి వింటుంది. ఆ మాటలు విన్న క్రిష్ షాక్ అవుతాడు. ఇక తర్వాత క్రిష్ ఎక్కడుంటే అక్కడ సత్య ఈ విషయాన్ని గురించి గుచ్చి గుచ్చి చెప్తూ కృషికి కోపాన్ని తెప్పిస్తుంది. ఉదయం కూడా క్రిష్ దగ్గర అతని గురించి చెప్తూ క్రిష్ కి కోపాన్ని తెప్పిస్తుంది.. నందిని కి సత్యకు వెనకుండి సపోర్ట్ చేసింది క్రిష్ అని తెలిసిపోతుంది. ఆ మాట క్రిష్ నోటి వెంట చెప్పించాలని నందిని, సత్య ఇద్దరూ ప్లాన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రచారం కోసం మహాదేవయ్య అంతా సిద్ధం చేస్తాడు. ఇక నందిని ఇంటికి వస్తుంది. అందరూ నిన్ను వెనక్కి తోయాలని చూస్తున్నారు వదిన చూశావా నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నావో.. సరేగాని నీకు ఫోటో షూట్ ఉంది పోస్టర్ల కోసం మనం ఫోటోషూట్ చేద్దాం రా అనేసి అంటుంది నందిని.. నువ్వు వెళ్లి జల్ది రెడీ అయ్యారా పో ఫోటోషూట్ మంచిగా ఉండాలని నందిని అంటుంది. క్రిష్ కూడా బాబు నీకు కూడా ఫోటోషూట్ ఉంది. ఆ అరేంజ్మెంట్లన్నీ చేశాను నువ్వు కూడా ఫోటోలు దిగాలి రెడీ అయ్యారా.. ఇక సత్య ఫోన్ తీసుకొని ఆ అదృశ్య శక్తి ఎవరు అని ఫోన్ నెంబర్ ని చెక్ చేస్తాడు. ఫోన్లో కూడా అదృశ్య శక్తి అని పెట్టుకోవడం చూసి షాక్ అవుతాడు అతనికి వెంటనే ఫోన్ చేస్తాడు. అలా అయిన నందిని మా చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడని అతనితో అదృశ్య శక్తి లాగా మాట్లాడుతుంది. క్రిష్ అతనిపై కోపంతో తప్పు చేస్తున్నామని అరుస్తాడు. నందిని సత్య ఇద్దరు మాట్లాడుకుంటారు. మా చిన్నన్నకు నువ్వంటే ఎంత ప్రేమ అర్థం అయిందా అని నందిని అంటుంది. ఆ ప్రేమను వదులుకోలేక కదా ఇంతగా నేను బాధపడుతున్నానని సత్య అంటుంది..
ఇక ఒకవైపు మహదేవయ్య ఫోటోషూట్ కోసం అంత అరేంజ్ చేస్తారు. అటు సత్య నందిని ఇద్దరు ఫోటోషూట్ చేస్తారు. అది చూసిన భైరవి ఫోటోషూట్ అంటే ఇదా ఇట్లా చేస్తారా అని ఎగతాళి చేస్తుంది.. మీ బాపు ఎన్నికల్లో గెలవడం ఖాయం ఆ తర్వాత ఇలాంటి ఫోటోషూట్ చేయాలంటూ కొన్ని యాంగిల్స్ లో ఫోజులిస్తుంది. ఆ ఫోటోలను సత్య తీస్తుంది ఇంకా భైరవికి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత క్రిష్ అక్కడికి వచ్చి ఇలా ఫోటోషూట్ చేస్తే ఓణీల ఫంక్షన్ లో ఉంది అటు వచ్చి బయట ఫోటోషూట్ చూడండి ఎలా ఉందో అని అంటాడు. సత్యాన్ని ఎక్కడికి వెళ్తారు.. మహదేవయ్యా ఫోటోలకి ఫోజులు ఇవ్వడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. భైరవి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంది. ఫోటోషూట్ చేయించాలని అనుకుంటుంది. భైరవికి చెప్పి ఫోటోషూట్ కదమ్మా గెలిచేది మాత్రం బాపుని చేసుకొని ఇవ్వలే అనేసి అంటాడు క్రిష్.
ఫోటోషూట్ అయిన వెంటనే నందిని నీ అదృశ్య అభిమానిని కలవాలని చెప్పావు కదా వదినా నువ్వు వెళ్లలేదు ఏంటి అంటే అవును మంచి టైంకి గుర్తు చేశావు నేను వెళ్ళొస్తాను నువ్వు ఫోటోలు సాయంత్రం వస్తాయి కదా అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం అనేసి అంటుంది. నువ్వు అసలు చెల్లివేనా అని అరుస్తాడు. ఇక సత్య ఫాలో అవుతూ క్రిష్ వెళ్తాడు. సత్య ఒక చోటికి వెళ్లి వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి సత్యకు లైన్ వేస్తాడు అతన్ని అడ్డుపెట్టుకొని క్రిష్ ను ఏడిపించాలని సత్య అనుకుంటుంది. అతని తన్ని పంపించేస్తాడు ఇక నందిని అబ్బాయి వేషంలో అక్కడికి వస్తుంది క్రిష్ అక్కడికి వచ్చి నందిని కొట్టబోతాడు ఇక నాటకం బయట పెడతారు సత్యానందిని. క్రిష్ సపోర్ట్ చేస్తుంది నేనే అని మొత్తానికి ఒప్పుకుంటాడు. ఎమ్మెల్యే ఎవడు అంత సీన్ కాదని సత్యను తక్కువ చేసి మాట్లాడి వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఫోటోలను చూసి మహదేవయ్య షాక్ అవుతాడు.. మరి ఏం జరుగుతుందో రేపు చూడాలి..