NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR )కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన సినిమాలతోనే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ కూడా మరింత పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ కి, యాక్టింగ్ కి ఫిదా అయిన సెలబ్రిటీలు కూడా ఉన్నారనటంలో సందేహం లేదు. అందుకే ఎన్టీఆర్ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని, కాసేపైనా ఆయనతో గడపాలని కోరుకునే అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అభిమానులు క్యాన్సర్ తో పోరాడుతూ ఎన్టీఆర్ ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని పరితపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం ఒక అభిమాని ఎన్టీఆర్ ను చూడాలి అని, కనీసం ఆయన నటించిన ‘దేవర’ సినిమా విడుదలై , తాను చూసేవరకైనా తనను బ్రతికించండి అంటూ డాక్టర్లను వేడుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో ఎన్టీఆర్ స్వయంగా ఆ అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడమే కాకుండా ఆ అబ్బాయి హాస్పిటల్ ఖర్చు మొత్తం ఎన్టీఆర్ స్వయంగా భరించారు కూడా..
ఎన్టీఆర్ ని కలవాలంటున్న క్యాన్సర్ పేషెంట్..
ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు మరొక అభిమాని తల్లి తన కూతురు క్యాన్సర్ తో బాధపడుతోందని, తన చివరి కోరికను తీర్చండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాస్తూ తన బాధను వెళ్ళబుచ్చుకుంది. అసలు విషయంలోకెళితే.. తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని.. తెలంగాణ హుజూరాబాద్ కి చెందిన ఒక క్యాన్సర్ పేషెంట్ కోరుకుంటుంది. ఆసుపత్రి బెడ్ పై ఉన్న తన కూతురి చివరి కోరికను తీర్చాలి అంటూ ఆమె తల్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ కూడా రాసింది. “నా కూతురు స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ను కలిసి మాట్లాడడమే ఆమె చిరకాల కోరిక. దయచేసి ఆయనను కలిసేలా అవకాశం కల్పించండి” అంటూ ఆ తల్లి రజిత రాసిన లేఖ ప్రస్తుతం అందరిని కంటతడి పెట్టేస్తోంది. మరి ఈ లెటర్ ఎన్టీఆర్ వరకు చేరుతుందా ? ఆయన ఆ క్యాన్సర్ పేషెంట్ ను కలుస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)!దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘దేవర 2’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘పుష్ప2’ సినిమాను ఏ రేంజ్ లో అయితే చిత్రీకరించారో అదే రేంజ్ లో దేవర 2 ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ మరింత బిజీగా మారిపోయారు ఎన్టీఆర్.