BigTV English

YouTuber Anvesh: అన్వేష్ కి బెదిరింపు కాల్స్.. చంపేస్తాం అంటున్నారంటూ ఆవేదన..!

YouTuber Anvesh: అన్వేష్ కి బెదిరింపు కాల్స్.. చంపేస్తాం అంటున్నారంటూ ఆవేదన..!

YouTuber Anvesh..యూట్యూబర్ గా, ప్రపంచ యాత్రికుడిగా, నా అన్వేషణ అంటూ విదేశాలు తిరుగుతూ.. తన మాటలతో , కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. పలు విషయాలతో అందరినీ ఆలోచింపచేసే యూట్యూబర్ అన్వేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పిస్తూ.. మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఈయనకు ఇప్పుడు చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఒక వీడియోని పంచుకున్న అన్వేష్.. తనను కాపాడండి అని అనడం మానేసి.. దమ్ముంటే రండి అంటూ సవాలు విసురుతున్నాడట. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


యూట్యూబర్ అన్వేష్ కి బెదిరింపు కాల్స్..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై కేసులు నమోదు కాగా.. విచారణ కూడా జరుపుతున్నారు పోలీసులు.అయితే ఇలాంటి సమయంలో యూట్యూబర్ నా అన్వేష్ చుట్టూ కథ తిరుగుతోంది. బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఈయన..యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్ వేదికగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ ద్వారా చర్యలు మొదలైన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా నా అన్వేషణ అన్వేష్ కు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. కానీ ఇదే సమయంలో ఇతడి పై కొంతమంది సోషలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పై పోరు చేస్తున్న క్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


సన్నీ యాదవ్ తల్లిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు..

ట్రావెల్ వ్లోగర్ భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) ను టార్గెట్ చేస్తూ ఆయన తల్లిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఇప్పుడు అన్వేష్ ఇండియాకు రాగానే అతనిపై కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్ ఒక ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ.. అందులో “గెట్ రెడీ టాలీవుడ్ 5 పీఎం ” అంటూ ముందు ఒక పోస్ట్ చేశాడు. ఆ తర్వాత “బెట్టింగ్ యాప్ పై పోరాటం ఆపకపోతే తనను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు” అంటూ వాపోయారు. అయితే తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని, తాను ప్రస్తుతం ఉన్న హోటల్ పేరును కూడా ప్రస్తావిస్తూ.. దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరాడు. ఇక ఈ విషయాన్ని కూడా అన్వేష్ తనదైన శైలిలో కామెడీగా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా బెట్టింగ్ ప్రమోటర్స్ పై పోరాటం చెయ్ తప్పులేదు. కానీ వారి కుటుంబ సభ్యుల పేర్లు తీస్తూ కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ అన్వేష్ పై పలువురు నెటిజెన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అన్వేష్ మరేవిధంగా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనా ఒక విషయానికి పోయి ఇంకో విషయంలో ఇరుక్కుంటున్నాడని ఆయన అభిమానులు కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×