CM Revanth Reddy : సూటిగా మాట్లాడారు. జనాభా లెక్కలు ముందేసి లాజిక్కులు విడమరిచి చెప్పారు. కేంద్ర నిధుల వాటాలో ఎంత అన్యాయం జరుగుతోందో వివరించారు. డీలిమిటేషన్ మరో 25 ఏళ్లు వాయిదా వేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్లమెంట్ సీట్ల సంఖ్య మారొద్దని.. జాతీయ స్థాయిలో కాకుండా స్టేట్ లెవెల్లో పునర్వవస్థీకర చేయాలని సూచించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి వెళితే కేవలం 42 పైసలే తిరిగి వస్తోందని.. అదే బీహార్ స్టేట్‌కు మాత్రం 6 రూపాయలు ఇస్తున్నారని రికార్డులు ముందేశారు. ఇలా కేంద్ర ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీ రోల్ ప్లే చేశారు.
కేవలం అభ్యంతరాలు, సలహాలు, సూచనలకే పరిమితం కాలేదు సీఎం రేవంత్. నెక్ట్స్ నాయకత్వం వహించేందుకు సైతం సై అన్నారు. తర్వాతి మీటింగ్ హైదరాబాద్‌లోనే పెడదామని.. ఒక బహిరంగ సభ కూడా నిర్వహిద్దామని ప్రతిపాదించారు. ఆల్ పార్టీ నేతలంతా అందుకు ఓకే చెప్పేయడంతో కేంద్రంపై పోరాటంలో ఇక కెప్టెన్ రోల్ పోషించనున్నారు రేవంత్‌రెడ్డి.
Also Read : రేవంత్ లాజిక్‌తో మోదీకి మైండ్ బ్లాక్!
మోదీకి సవాల్ విసిరేలా.. జాతీయ స్థాయి యాక్షన్ ప్లాన్ సైతం రేవంత్ రెడీ చేశారు. సౌత్ స్టేట్స్‌తో పాటు డీలిమిటేషన్‌తో నష్టపోయే పంజాబ్, ఒడిశా లాంటి ఇతర రాష్ట్రాలనూ కలుపుకొని పోవాలని నిర్ణయించారు. ఆయా స్టేట్స్‌లోని బీజేపీయేతర ఎంపీలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇక పోరాటం మొదలుపెట్టాలని.. అందుకు ఎంపీల కమిటీ యాక్టివ్‌గా పని చేయాలని అన్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఓ ఆఫీసు కూడా ఓపెన్ చేయాలనే రేవంత్ సూచనకు అఖిల పక్షం ఓకే చేసింది. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు, మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీ స్థానాలు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన సూచనను అంతా స్వాగతించారు. ఇలా చెన్నై మీటింగ్ పెట్టింది తమిళనాడు సీఎం స్టాలిన్ అయినా.. ఆ సమావేశంలో హైలైట్‌గా నిలిచింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డినే అని అంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎంటర్ అయ్యాకే వేడి పుట్టిందా?
కేంద్రానికి వ్యతిరేకంగా డీలిమిటేషన్‌పై మొదటిగా పోరు మొదటబెట్టిందే సీఎం రేవంత్‌రెడ్డి. కొన్ని నెలల క్రితం కేరళ పర్యటనలోనే బీజేపీ నిర్ణయంపై జంగ్ సైరన్ మోగించారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. డీలిమిటేషన్‌తో సౌత్ ఇండియాలో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే, ఒక్క సీటు తగ్గదంటే పెరగదనేగా మీనింగ్? ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయి కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరగవని అమిత్ షా చెప్పకనే చెప్పారంటూ రేవంత్ ఆనాడే లాజిక్ వివరించి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి యాక్టివ్ అయ్యాకే సౌత్ ఇండియా స్టేట్స్‌లో కదలిక వచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం వాయిస్ పెంచారు. అప్పటికే అక్కడ హిందీ రచ్చ నడుస్తోంది. సింగిల్‌గా ఫైట్ చేస్తే బలం సరిపోదని భావించి.. చెన్నైలో బీజేపీయేతర ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఊహించినట్టుగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాక్టివ్ రోల్ పోషించారు. నెక్ట్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఫిక్స్ చేసి.. డీలిమిటేషన్‌పై సౌత్ ఇండియన్ స్టేట్స్ చేస్తున్న పోరాటానికి టార్చ్ బేరర్‌గా మారారు.