Anchor Pradeep:బుల్లితెర ఇండస్ట్రీలో ఫీమేల్ యాంకర్స్ లో సుమా కనకాల (Suma kanakala) ఎంతటి క్రేజ్ అయితే సొంతం చేసుకుందో.. ఇటు మేల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju ) కూడా అంతే పాపులారిటీ దక్కించుకున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ.. తన మాటలతో, కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్న ఈయన.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
దీపిక పిల్లి తో రొమాన్స్ కి సిద్ధమైన ప్రదీప్ మాచిరాజు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే టైటిల్తో ప్రదీప్ మాచిరాజు – దీపిక పిల్లి (Deepika Pilli) తో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ప్రదీప్ మాచిరాజు ఇండస్ట్రీలో ఇటు బుల్లితెరపై బిజీగా దూసుకుపోతున్నారు. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పటికే పలువురితో వివాహానికి సిద్ధం అయ్యారు అంటూ పలు రకాల వార్తలు వచ్చినా ఏ ఒక్కటి నిజం కాలేదు. మొన్నటికి మొన్న బిజినెస్ మాన్ కూతురిని వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ తో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టారు ప్రదీప్ మాచిరాజు.
పొలిటికల్ లీడర్ తో పెళ్లిపై ప్రదీప్ క్లారిటీ..
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ప్రదీప్ మాచిరాజుకు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఒక పొలిటికల్ లీడర్ తో వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని ప్రశ్నించగా.. వెంటనే ఆయన రియాక్ట్ అవుతూ..” నాకంటూ కొన్ని డ్రీమ్స్, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి.వాటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా నా డ్రీమ్స్ అన్ని ఫుల్ ఫిల్ అయిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇప్పటివరకు పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలు లేవు. ముందు నేను జీవితంలో సెటిల్ కావాలి. ఆ తర్వాతే ఏదైనా.. అటు పొలిటికల్ లీడర్ తో కూడా నేను వివాహానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నేను విన్నాను. అంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో కూడా పెళ్లి అన్నారు. త్వరలోనే క్రికెటర్ తో పెళ్లి అంటారేమో.. అవన్నీ సరదా ప్రచారాలు మాత్రమే.. ఏది కూడా మీరు నమ్మవద్దు. స్పష్టంగా నేను ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాను అని ప్రకటించే వరకు రూమర్స్ ని నమ్మకండి” అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రదీప్ మాచిరాజు. మొత్తానికి అయితే పెళ్లిపై, పొలిటికల్ లీడర్తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రదీప్ ఆర్జే గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఢీ వంటి షోలలో యాంకర్ సెటిల్ అయిపోయారు. ఇక భారీగానే సంపాదిస్తూ అటు సినిమాలలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అని చెప్పవచ్చు.
Redin Kingsley: తండ్రైన కమెడియన్.. మహాలక్ష్మికి జన్మనిచ్చామంటూ పోస్ట్..!