E-Paper
Advertisement

Shoaib Akhtar: రాసి పెట్టుకోండి.. ఐపీఎల్ వ‌ల్ల టైటానిక్ లాగా PSL మునిగిపోతుంది

Shoaib Akhtar: రాసి పెట్టుకోండి.. ఐపీఎల్ వ‌ల్ల టైటానిక్ లాగా PSL మునిగిపోతుంది
Advertisement

Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( Indian Premier League 2026 Tournament) అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఎదురుదెబ్బ తగులుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకున్న విదేశీ క్రికెటర్లందరూ మెల్లిగా ఐపిఎల్ మొగ్గు చూపిస్తున్నారు. గాయాల కారణంగా చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ కు దూరమైన నేపథ్యంలో వాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు ఇక్కడి నుంచి ఇండియాకు వెళ్ళిపోతున్నారు. ఐపీఎల్ ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి అన్న కారణంతో జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే బ్లెస్సింగ్ ముజారాబాని ( Blessing Muzarabani ) లాంటి క్రికెటర్లు ఐపీఎల్ వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament )
భవిష్యత్తుపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కారణంగా అతి త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ టైటానిక్ షిప్ లాగా మునిగిపోతుందని బాంబు పేల్చారు.

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

ఐపీఎల్ వ‌ల్ల టైటానిక్ లాగా PSL మునిగిపోతుంది

Advertisement

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో విదేశీ క్రికెట‌ర్లు మెల్లిగా జారుకుంటున్నారు. ఐపీఎల్ లో ఎక్కువ‌గా డ‌బ్బులు వ‌స్తాయ‌న్న కార‌ణంతో గాయాల కార‌ణంగా దూర‌మైన వాళ్ల స్థానంలో పీఎస్ఎల్ ఆడాల్సిన ప్లేయ‌ర్లు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పీఎస్ఎల్ టోర్న‌మెంట్ కు అన్యాయం జ‌రుగుతోంది.  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే చాలామంది విదేశీ ప్రేయర్లు జారుకుంటున్నారని మండిపడ్డారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.

పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాల్సిన ప్లేయర్లు అందరూ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐపిఎల్ వల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ అంతరించిపోతుందని బాంబు పేల్చారు. టైటానిక్ షిప్ లాగా ఒకేసారి మునిగిపోవచ్చు అని తెలిపారు. కాబట్టి ఇకపైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ షెడ్యూల్ విషయంలో మార్పులు చేస్తే బాగుంటుందని సూచించారు. ఐపీఎల్ జరిగేటప్పుడు అస్సలు పాకిస్తాన్ సూపర్ లీగ్ పెట్టకూడదని రిక్వెస్ట్ చేశారు షోయబ్ అక్తర్. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లు రెండు రోజుల వ్యవధిలోనే ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం అవుతుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మాత్రం మార్చి 28వ తేదీన షురూ కానుంది. దీంతో విదేశీ క్రికెటర్లు తెలివిగా IPL లాడేందుకు ఆసక్తి చూపించి , జంప్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది లాంటి ప్లేయర్లు గుర్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

 

 

 

https://www.facebook.com/photo/?fbid=1566261851134553&set=gm.26708101385474715&idorvanity=413972538647625

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×