E-Paper
Advertisement

బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

బంగారు ప్రియులకు శుభవార్త..  మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Gold-Silver Price Down: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం, సిల్వర్ ధరలపై పడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పతనమవుతున్నాయి. 7 నెలల కనిష్ఠాలకు ధరలు పడిపోయాయి. గురువారం ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కు దిగొచ్చింది. అటు సిల్వర్ ధరల పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం-వెండి ధరలు దిగొస్తున్నాయి.

బంగారు ప్రియులకు శుభవార్త.. పడిపోతున్న ధరలు

Advertisement

బంగారానికి దేశంలో మంచి డిమాండ్ ఉంది. పసిడి ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనాతోపాటు భారత్ ఉంది. దేశీయంగా బంగారం అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించాలని భారతీయ మహిళలు ఆసక్తి చూపుతుంటారు.

కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా కాసింత డిమాండ్ కాస్త తగ్గింది. గతేడాది బంగారం 70 శాతం, వెండి 150 శాతం వరకు ధరలు పెరిగాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి పసిడి-వెండి ధరలు పతనమవుతున్నాయి.

Advertisement

అంతర్జాతీయ పరిణామాలు కారణమంటున్న మార్కెట్ వర్గాలు

అమెరికా డాలర్ బలంగా ఉండడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు పెరగడంతో బంగారం-సిల్వర్ ధరలు పతనం అవుతున్నాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏకంగా 7 నెలల కనిష్ఠానికి పడిపోయాయి.

ఇక స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4 వేల డాలర్ల దిగువకు దిగొచ్చింది. జూన్ 25 నాటికి 3980 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇక సిల్వర్ గురించి చెప్పనక్కర్లేదు. 57 డాలర్ల దిగువకు ట్రేడింగ్ జరుగుతోంది. హై నుంచి భారీగా ధరలు దిగొచ్చాయి. ఇక దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ లో గురువారం 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములు రూ. 1,44,330 వద్ద ఉంది.

ALSO READ: పెళ్లిళ్ల సీజన్ ఆఫర్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

2025 నవంబర్ కనిష్టాలకు చేరింది. దాదాపు 7 నెలల దిగువకు ధర పడిపోయింది. ఇక 22 కారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1,32,300 వద్ద ఉంది. బుధవారం కంటే ఏకంగా రూ.3100 తగ్గిందని చెప్పవచ్చు. సిల్వర్ ధర ఒక్కరోజులో రూ. 10 వేలు తగ్గి కిలో రూ. 2.40 లక్షల వద్ద కొనసాగుతోంది. రానున్న రోజుల్లో బంగారం-వెండి ధరలు మరింత పతనం కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన

నెలకు రూ.68 కోట్లు సంపాదిస్తున్న మిస్టర్ బీస్ట్.. పెద్ద యూట్యూబర్ కావాలంటే ఏం చేయాలి

రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్లు జైలు శిక్ష.. సిమ్ కార్డు దుర్వినియోగంపై కేంద్రం కఠిన నిబంధనలు

బంగారం ధరలు పతనం.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు

ఈఎంఐ తక్కువే అని లోన్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులు మునుపటిలాగే ఫ్రీ.. NPCI కీలక ప్రకటన!

రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!

యుపిఐ ఎండిఆర్ తప్పుడు నిర్ణయం, మళ్లీ క్యాష్ వైపు దేశం.. మాజీ నీతి ఆయోగ్ చీఫ్ వార్నింగ్

Big Stories

Advertisement
×