Zakir Hussain: ఇండస్ట్రీలో మరో విషాదం అందరిని కలిచివేసింది. ప్రఖ్యాత తబలా విద్వాంసుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాకీర్ హుస్సేన్ (Zakir Hussain)(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన రెండు వారాల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందారు. ఈ క్రమంలోనే ఆయన కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ మొదట ఆదివారం రాత్రి చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని కూడా తెలిపారు. ఆ తర్వాత ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
జాకీర్ హుస్సేన్ విషయానికి వస్తే..
తబలా మ్యాస్ట్రోగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్య కారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటినుండి తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలోనే హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి, తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే జాకీర్ హుస్సేన్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన ఒక్కో కచేరికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయాలు వైరల్ అవుతుండగా.. అందులో భాగంగానే ప్రముఖ పాపులార్ టీ బ్రాండ్ “వాహ్ తాజ్ టీ” యాడ్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఒక్కో కచేరీకి ఎంత రెమ్యునరేషన్ అంటే..
కచేరి యొక్క స్థాయిని బట్టి ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటల్, వర్క్ షాప్, పర్సనల్ ఫంక్షన్స్ ,చారిటీ ట్రస్ట్, కార్పొరేట్ ఫంక్షన్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్ ఇలా ఒక్కొక్క దాన్ని రేంజ్ ను బట్టి ఆయన ఛార్జ్ చేస్తారని సమాచారం. ముఖ్యంగా 3 నుండి 4 గంటల పెర్ఫార్మన్స్ ఇస్తే రూ.2 నుండి రూ.10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయన కచేరి కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాహ్ తాజ్ యాడ్ కోసం జాకీర్ హుస్సేన్ రెమ్యూనరేషన్..
వాహ్ తాజ్ ప్రకటన కోసం 1980 చివరిలో జాకీర్ హుస్సేన్ షూటింగ్ నిర్వహించారు. ఇక అప్పట్లోనే ఈ యాడ్ కోసం రూ.50,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు.. 1980 లోనే రూ.50,000 అంటే ఇది భారీ మొత్తమని చెప్పవచ్చు. తాజ్ మహల్ ముందు జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లు చూపబడిన ఈ ప్రకటన భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ ను ప్రీమియం బ్రాండ్ గా మార్చడంలో ఈ యాడ్ చాలా బాగా సహాయపడిందని చెప్పవచ్చు.
జాకీర్ హుస్సేన్ అందుకున్న అవార్డులు..
1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు తో పాటు 2009లో గ్రామీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇక 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఇక జాకీర్ హుస్సేన్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక తన కెరియర్లో మొత్తం ఐదు గ్రామీ అవార్డులు అందుకున్న ఆయన, ఈ ఏడాది 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.