BigTV English

Chile Wildfires Update: ఆగని కార్చిచ్చు.. 112 మంది మృతి.. వందల మంది ఆచూకీ గల్లంతు!

Chile Forest Fires : చిలీ దేశంలో శాంటియాగో ప్రాంతంలో మూడు రోజులు క్రితం సంభంవించిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇప్పటివరకు ఈ కార్చిచ్చులో 112 మంది మరణించారు. కార్చిచ్చు వల్ల అనేక వేల మంది గాయపడ్డారు. మంటల్లో వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

Chile Wildfires Update: ఆగని కార్చిచ్చు.. 112 మంది మృతి.. వందల మంది ఆచూకీ గల్లంతు!
Chile forest fire news

112 People Dies in Chile Forest Fire:


చిలీ దేశంలోని శాంటియాగో ప్రాంతంలో మూడు రోజుల క్రితం సంభంవించిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇప్పటివరకు ఈ కార్చిచ్చులో 112 మంది మరణించారు. కార్చిచ్చు వల్ల వేల మంది గాయపడ్డారు. మంటల్లో వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చు వల్ల దాదాపు 1,600 మంది పూర్తిగా నిరాశ్రయులుగా మారారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత బొటానికల్‌ గార్డెన్‌ అగ్నికి ఆహుతి అయింది. బొటానికల్ గార్డెన్‌ని 1931లో స్థాపించారు. నగరం చుట్టూ మంటల వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు వల్ల వియాడెల్‌ మార్‌ పట్టణంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆ ప్రాంతాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతం అంతా పోగతో నిండిపోయింది. చాలా మంది ప్రజలు భయంతో తమ నివాసాల్లోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలు దట్టమైన పొగ నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు. వియాడెల్‌ మార్‌లో పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది ఆచూకీ తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో దాదాపుగా మూడు మిలియన్లు జనాభా నివాసం ఉంటున్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో వేసవిలో నిర్వహించే మ్యూజిక్ ఫెస్టివల్ ప్రపంచంలోనే విశేష ఆదరణ పొందింది.


దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. గాయాలతో ఆస్పత్రుల్లో చేరినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ రెస్క్యూ టీంలకు సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. వియా డెల్‌ మార్‌ పట్టణం వల్పరైజో రీజియన్‌ గవర్నర్‌ రోడ్రిగో కార్చిచ్చులపై పలు అనుమానం వ్యక్తం చేశారు. ఏవరో కావాలనే కార్చిచ్చుని సృష్టించారని ఆయన తెలిపారు. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలు రేకేతిస్తోందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో కార్చిర్చు ఎలా ఏర్పడిందో అసలైన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై చిలీ అంతర్గత మంత్రి కరోలినా మట్లాడారు. దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉన్నాయని తెలిపారు. వాతవరణం ప్రతికూలంగా మారడంతో మంటలను అదుపు చేయటం కష్టంగా మారిందన్నారు. వల్పరైసో ప్రాంతంలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రజలందరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వల్పరైసో ప్రాంతంలో మూడు షెల్టర్ క్యాంపులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

మంటలు వ్యాప్తి ఎక్కువుగా ఉండటంతో ఆ ప్రాంతాలకు రెస్క్యూ టీమ్‌లు చేరుకోవటం మరింత కష్టంగా మారిందని తోహా చెప్పారు. మంటలను అదుపు చేసేందుకు 19 హెలికాప్టర్లు వినియోగిస్తున్నామన్నారు. మంటలను అదుపు చేసేందుకు 450 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారని చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా వెల్లడించారు.

Tags

Related News

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Big Stories

×