BigTV English

Ethiopia Landslide: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి

Ethiopia Landslide: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి

Ethiopia Landslides: ఇథియోపియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా అతలాకుతలం అయింది. కొండ చరియలు విరిగిపడి 157 మంది మరణించారు. అందులో చిన్న పిల్లలు, గర్భిణులు సహా వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


సోమవారం దక్షిణ ఇథియోపియాలోని గోఫా జోన్ పరిధిలో ఉన్న కెంచో షాచా గోజ్జి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఎగువ నుంచి వచ్చిన బురద ముంచెత్తింది. వాటిలో కూరుకుపోయి ఊపిరి ఆడక 157 మంది మరణించారు. ఇథియోపియా కొండచరియలు కూలి మరణించిన వారి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. బురదలో కూరుకుపోయి 157 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలను రక్షించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనలో అనేక మంది గల్లంతు అయినట్లు వెల్లడించారు.

బురదలో విగతజీవులగా మరిన తల్లి, శిశువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఉండటాన్ని చూసి అందరూ కంటతడి పెట్టారు. ఏటా వర్షాకాలంలో జులై నుంచి సెప్టెంబర్ మూడో వారం వరకు ఇథియోపియాలోని కొండ ప్రాంతాల్లో ఈ విధంగా కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ప్రమాద నేపథ్యంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు చాలా ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. వాటిని బయటకు తీసుకురాలేకపోతున్నామని అన్నారు.


Also Read: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి

మృతదేహాల కోసం గాలిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మట్టిని తొలగించే యంత్రాలు లేకపోవడం వల్ల ఎర్రమట్టిని తమ చేతులతో తవ్వుతున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గోఫా రాజధాని అడిస్ అబాబా నుంచి 320 కి.మీ దూరంలో ఉంది. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు వెల్లడించారు.

Related News

Ukraine vs Russia: ట్రంప్ శాంతి ప్రయత్నాలు విఫలమా? రష్యా డ్రోన్ దాడితో మునిగిన ఉక్రెయిన్ నౌక

Fighter Jet Crashes: కూలిన ఎఫ్-16 యుద్ధ విమానం.. స్పాట్‌లోనే పైలట్ మృతి

Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?

H1B New Rules: గ్రీన్ కార్డ్స్, వీసాలపై ట్రంప్ బాంబ్.. ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

Nuke India: ‘ట్రంపును చంపాలి.. ఇండియాపై అణు బాంబు వెయ్యాలి.. అమెరికా షూటర్ గన్ పై సంచలన నినాదాలు

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Big Stories

×