BigTV English

Narendra Modi: ఆ ఫ్యాషన్ షోలో నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ట్వీట్

Narendra Modi: ఆ ఫ్యాషన్ షోలో నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ట్వీట్
Advertisement

Artificial Intelligence: దేశ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సుప్రీమ్ లీడర్లు వరుసగా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఎలన్ మస్క్, ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇలా ప్రముఖులంతా వివిధ వస్త్రధారణల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. వారి సరసన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తూ ఆ వీడియో కనిపించారు. వీరంతా ఫ్యాషన్ షోలో పాల్గొనడమేంటీ? అదీ ఏకంగా ర్యాంప్ వాక్ చేయడమేంటీ? అనే కదా మీ డౌటు. ఇదంతా నిజంగా జరిగిన ఫ్యాషన్ షో కాదు. ఇది కృత్రిమ మేధ సృష్టి.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో అద్భుతాలు, విచిత్రాలు, నమ్మశక్యం కాని విషయాలను సృష్టిస్తున్నది. అసలు లేని మనిషిని కూడా చిత్రాలు, వీడియోల రూపంలో మనకు దృశ్యమానం చేస్తున్నది. ఇద్దరి ముగ్గురు ఫొటోలను కలిపి కొత్త మనిషి చిత్రాన్ని సృష్టిస్తున్నది. ఇదే వరసలో దేశ దేశాల అధినేతల ఫొటోలు, వీడియోలను ఆధారం చేసుకుని విభిన్న వస్త్రధారణతో ర్యాంప్ వాక్ చేస్తున్నట్టుగా ఓ వీడియోను ఏఐ సృష్టించింది. ఈ వీడియోను టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో వరల్డ్ లీడర్స్ వయ్యారాలుపోతూ ర్యాంప్ వాక్‌లు చేశారు. ఇదంతా నిజం కాకపోయినా దేశాధినేతలు ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఆ వీడియో ఆసక్తికరంగా మారింది.

ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ హీరో లెవెల్‌లో నడుచుకుంటూ వస్తుండగా జో బైడెన్ మాత్రం వయసు రీత్యా నడవలేక వీల్ చైర్‌లో ర్యాంప్ పై వస్తున్నట్టుగా ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మస్క్ సమర్థిస్తున్న విషయం తెలుస్తూనే ఉన్నది. నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల వస్త్రాలంకరణలో ర్యాంప్ పై నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఆ వీడియో ఉన్నది.

Related News

దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Big Stories

×