Big Stories

Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

Iran Seizes Israeli Ship: ఇరాన్ అనుకున్నట్లుగానే ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమైంది. రణరంగంలో సై అంటుంది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ ను స్వాధీనం చేసుకుంది. గల్ఫలోని ఇజ్రాయెల్ కు సంబంధించిన కంటైనర్ ను ఇరాన్ గార్డ్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ షిప్ లో 17 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

యూఈఏ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలో ఎంసీఎస్ ఏరీస్ పేరుతో ఉన్న భారీ నౌకను ఇరాన్ నేవీ అధికాలు తమ స్వాధీనంలో తీసుకున్నట్లు ప్రకటించారు. తమ ఆధీనంలో ఉన్న షిప్ ను ప్రస్తుతం ఇరాన్ వైపుగా మళ్లిస్తున్నట్లు ఇరాన్ నావికాదళం వెల్లడించింది.

- Advertisement -

అయితే ఈ చర్యతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే.. ఇరాన్ అదుపులోకి తీసుకున్న ఇజ్రాయోల్ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వారి భద్రతపై భారత్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వెంటనే వారిని విడుదల చేయాలని.. భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఈ షిప్ లో మొత్తం 25 మంది ఉన్నారు. అయితే వీరిలో 17 మంది భారతీయులే కావడం విశేషం. ఈ విషయం తెలుకున్న వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో మరో సారి ఇరాన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలోని తమ రాయబారి కార్యాలయంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడులకు ప్రతీకారం తప్పదని స్పష్టం చేసింది. ఏ రాత్రి అయినా ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అని ఇరాన్ హెచ్చరించింది.

Also Read: Balochistan Terror Attack : బలూచిస్థాన్ లో ఉగ్రదాడి.. 11 మంది మృతి

కాగా, శుక్రవారం రాగల 48 గంటల్లో ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని ఇరాన్ ప్రభుత్వం తరఫున అధికారులు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News