BigTV English

Rohit Sharma as Bus Driver: టీం సారథి నుండి రథ సారడిగా రోహిత్ శర్మ.. MI బస్సు నడిపిన వీడియో వైరల్..!

Rohit Sharma as Bus Driver: టీం సారథి నుండి రథ సారడిగా రోహిత్ శర్మ.. MI బస్సు నడిపిన వీడియో వైరల్..!

Rohit Sharma Driving a Bus: ఏప్రిల్ 14, ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగబోయే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు బస్ డ్రైవర్‌గా మారాడు. ఐపీఎల్‌లో ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణించే ఈ సీజన్‌లో ఈ మ్యాచ్ అతిపెద్ద క్లాష్‌ అని చెప్పొచ్చు. ఇలాంటి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నప్పుడు ముంబై జట్టు సరదా మూడ్‌లో కనిపించింది.


ఒక వైరల్ వీడియోలో, అభిమానులు బ్రహ్మరథం పట్టడంతో రోహిత్ జట్టు బస్సుకు డ్రైవర్ బాధ్యతలు స్వీకరించాడు. ముంబై ఇండియన్స్ టీమ్ బస్సు వద్ద ఊగిపోతున్న అభిమానులు రోహిత్ డ్రైవర్ సీటులోకి వస్తున్న అరుదైన దృశ్యాన్ని చూశారు. వారు ఆనందంతో పొంగిపోయి రోహిత్ చిత్రాన్ని క్లిక్ చేశారు. రోహిత్‌ను బస్సు డ్రైవర్‌గా చూసి అతని సహచరులు కూడా కొత్త పాత్రను ఆస్వాదించినట్లు అనిపించింది. ఆటగాళ్లు నవ్వుతూ రోహిత్ వీడియోను తీశారు. హిట్‌మ్యాన్ అతని ఫోన్‌లో అభిమానుల హడావిడిని వీడియో తీసుకున్నాడు. ప్రాక్టీస్ ముగిసిన అనంతరం టీమ్ హోటల్‌కి బయలుదేరుతుండగా ఇది చోటు చేసుకుంది.

అంతకుముందు, రోహిత్ తన రేంజ్ రోవర్‌లో వాంఖడే స్టేడియానికి వచ్చాడు. లగ్జరీ కారులో క్రేజీ అంటే అతని కారు నంబర్ ప్లేట్. రోహిత్ కారు నెంబర్ 0264. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో శ్రీలంకపై రోహిత్ డబుల్ సెంచరీ(264) చేసి వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో అదే నెంబర్‌ను తన కారు నెంబర్‌గా సెట్ చేశాడు.


Also Read: Preity Zinta: రోహిత్ కోసం ఉన్నదంతా ఇచ్చేస్తా: ప్రీతి జింతా

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సహ యజమాని, ఆకాష్ అంబానీ, వాంఖడే స్టేడియం సమీపంలో రోహిత్‌తో కలిసి కనిపించారు. ఆకాష్ అల్ట్రా-విలాసవంతమైన కారును నడుపుతుండగా, రోహిత్ ప్యాసింజర్ సీట్లో కూర్చోని ఇద్దరూ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు.

క్యాష్ రిచ్ లీగ్‌లోని ఎల్ క్లాసికోలో MS ధోని రోహిత్‌తో తలపడనుండడంతో హై-ఆక్టేన్ క్లాష్ జరుగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, సీజన్ ప్రారంభానికి ముందు రెండు ఫ్రాంచైజీల కెప్టెన్సీలో మార్పు ఉన్నందున, 5-సార్లు ఛాంపియన్‌లు అయిన రెండు టీమ్‌లకు కొత్త కెప్టెన్లు సందడి చేస్తున్నారు. లీగ్ చరిత్రలో తొలిసారిగా, రోహిత్, ధోనీ ఇద్దరూ MI, CSK జెర్సీలలో ఒకరినొకరు సాధారణ ఆటగాళ్లుగా ఎదుర్కోనున్నారు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×