Nepal: నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేస్తోందా? ఏదో విధంగా అక్కడ వెళ్లేవారికి ఇబ్బందులు తప్పలేదా? మొన్నటి ఆకస్మిక వరదల నుంచి ఇంకా తేరుకోలేదు. తాజాగా టిబెట్ సరిహద్దులోని పశ్చిమ నేపాల్‌లోని హిమాల్ బేస్ క్యాంప్‌పై భారీగా మంచు చరియలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
మొన్న వచ్చిన ఆకస్మిక వరదల నుంచి ఇంకా తేరుకోలేదు నేపాల్. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా టిబెట్ సరిహద్దు పశ్చిమ నేపాల్‌లోని హిమ్లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్‌పై భారీగా మంచు చరియలు విరుచుకుపడ్డాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 10 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లగించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గతవారం యాత్ర బృందాలకు సహాయకులుగా ఉండేవారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. అయితే కొందరు అక్కడే ఉండిపోయినట్లు సమాచారం.
నేపాల్‌లోని మనంగ్ జిల్లాలోని నార్ ఫూ ప్రాంతంలో 7126 మీటర్ల ఎత్తైన హిమ్లుంగ్ హిమాల్ శిఖరం ఉంది. ఈ ప్రాంతంలో ఆకస్మికంగా హిమపాతం విరుచుకుపడటంతో పర్వతారోహకులు, సహాయక సిబ్బంది 10 మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయింది. ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ నేపాల్ ప్రధాన కార్యదర్శి భండారి ఈ సంఘటనను ధృవీకరించారు. ఈ సంఘటన నిజమేనని చెప్పుకొచ్చారు. లెక్కలోకి రాని వాటిలో రెండు ఇమాజిన్ నేపాల్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాలయన్ హాలిడేస్ నేపాల్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు.
తమ శాఖ వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోందని పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ రామ్ కృష్ణ లమిచానే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారని, గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పర్వత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు, మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. గల్లంతైన వారిలో హిమాలయన్ హాలిడేస్ నేపాల్‌కు చెందిన ఎనిమిది మంది సిబ్బంది, ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్‌కు చెందిన ఇద్దరు వంట సిబ్బంది ఉన్నారు.
ALSO READ: లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!
భారీ హిమపాతం కారణంగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. బేస్ క్యాంప్‌లోని టెంట్లు హిమపాతం కింద కూరుకుపోయిన తర్వాత సంబంధాలు తెగిపోయాయని అంటున్నారు. తీవ్రమైన వాతావరణం నేపథ్యంలో అధికారులు, సహాయక బృందాలు సమాచారం సేకరిస్తున్నారు. ఆదివారం ఉదయం వరకు గాలింపు, సహాయక చర్యల వివరాలను విడుదల చేయలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు మూసి వేయబడటం జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.