Kissik Talks: కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ సందర్భంగా షో సందడి సందడిగా సాగింది . ఫైమా, యాదమరాజు, విష్ణుప్రియ, డెమోన్ పవన్, వర్షతో పాటు ఇతరులు పాల్గొన్న ఈ వేడుకల్లో సరదా ఆటలు, పాటలు, కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను నవ్వించాయి. ముఖ్యంగా ఒక్కొక్కరి మధ్య ఉన్న బాండింగ్, ఒకరిపై ఒకరు వేసుకున్న సెటైర్లు ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సెలబ్రేషన్స్‌లో ఫైమా గురించి మాట్లాడిన సమయంలో ఆమెకు దగ్గరైన వ్యక్తుల గురించి సరదాగా ప్రస్తావన వచ్చింది. ఎవరు నిజంగా తనకు క్లోజ్, ఎవరి గురించి ఏం అనుకుంటుంది అనే విషయంలో అక్కడున్న వాళ్లు ఫైమాను ఆటపట్టించారు. ఆమె కూడా అంతే సరదాగా స్పందించడంతో కాసేపు సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
ఆ తర్వాత బాంగిల్స్‌కు సంబంధించిన గేమ్ మొదలైంది. ఒక్కొక్కరి చేతి సైజ్‌ను అంచనా వేసి సరైన బాంగిల్‌ను ఎంచుకోవాల్సిన టాస్క్ పెట్టారు. విష్ణుప్రియను కూడా ఇందులో భాగం చేయడంతో సరదా మరింత పెరిగింది. తన చేతి సైజ్‌కు బాంగిల్ సరిపోతుందా లేదా అంటూ ముందే ఊహించుకోవడం, ఆ తర్వాత సరైన సైజ్‌ను గుర్తించే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంది.
నన్ను కొట్టడానికి ఇచ్చిన గిఫ్ట్
ఈ సందర్భంలో యాదమరాజు, విష్ణుప్రియ మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా హైలైట్‌గా నిలిచింది. విష్ణుప్రియ తనకు గిఫ్ట్‌గా గోల్డ్ బాంగిల్స్ ఇచ్చిందని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. అయితే అది నిజమైన సీరియస్ సీన్ కాదని,. ‘నన్ను కొట్టడానికి ఇచ్చిన గిఫ్ట్’ అని అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.
యాదమరాజు బాంగిల్ సైజ్‌ను ఎలా గుర్తించాడన్న విషయంపైనా సరదా చర్చ జరిగింది. ఫైమా ఏదో చెప్పినప్పటికీ, ముందుగా బాంగిల్ తీసుకుని సరైన సైజ్ చూసి తర్వాత చెప్పినట్టుగా అర్థం అవడం గేమ్ ని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చింది.
స్టెల్లా కోసం పాట పాడిన యాదమ్మ రాజు
తర్వాత సోనియాను స్టేజ్‌పైకి పిలవడంతో సందడి మరింత పెరిగింది. ఆమె రావడంతో అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు. గేమ్‌లో భాగంగా సరైన సమాధానం చెప్పినందుకు డాన్స్ చేయాలని కూడా సరదాగా చెప్పారు. దాంతో పాటలు, స్టెప్పులు, పంచ్ డైలాగులతో ఈవెంట్ సందడి సందడిగా సాగింది.
ఈ సెలబ్రేషన్స్‌లో విష్ణుప్రియను ఉద్దేశించి సిద్ధార్థ్ ఒక పాట పాడటంతో పాటు, యాదమరాజు కూడా స్టెల్లా కోసం పాట పాడాడు. తనదైన స్టైల్లో పాట పాడుతూ యాదమరాజు చేసిన పెర్ఫార్మెన్స్‌పై అక్కడున్నవాళ్లు కామెంట్లు చేశారు. ప్రేమ పాట పాడుతున్నప్పటికీ మధ్యలో వచ్చిన సరదా పంచ్‌లు ఆ సన్నివేశాన్ని కామెడీగా మార్చేశాయి.
ఇక ‘ప్రపంచంలో ఎంతో మంది అబ్బాయిలు ఉండగా నిన్నే ఎందుకు ప్రేమించాను?’ అంటూ సరదాగా ప్రశ్న వేయగా, దానికి యాదమరాజు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. ‘నా లాంటోడు ఒక్కడూ ఉండడు’ అంటూ ఇచ్చిన రిప్లైకి వెంటనే కౌంటర్ రావడంతో మరోసారి నవ్వులు పూశాయి. తనలాంటి వాళ్లు ప్రపంచంలో ఇంకెవరూ లేరా అంటూ ప్రశ్న రావడంతో యాదమరాజు కూడా ఫన్నీగా రియాక్ట్ అవడం విశేషం .
also read :సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!
ఫైమా ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా పాట
ఆ తర్వాత మళ్లీ బాంగిల్ సైజ్ గేమ్ కంటిన్యూ అయింది. ఫైమా కోసం కూడా బాంగిల్ సైజ్ గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ‘కొత్త పెళ్లికూతురు, కొత్త పెళ్లికొడుకు’ అంటూ చేసిన కామెంట్స్‌తో షోలోని వాళ్లంతా నవ్వుకున్నారు. ఫైమాని ప్రవీణ్ కోసం ప్రత్యేకంగా ఒక పాట పాడాలని చెప్పడంతో ‘నా కోసం నిన్నే నా జతగా ఏదైవం పంపెనో బహుమతిగా’ అంటూ పాట పాడటం అక్కడి వాతావరణాన్ని కాస్త ఎమోషనల్‌గా మార్చింది. అయితే వెంటనే స్టెప్పులు, సరదా కామెంట్లు రావడంతో మళ్లీ ఫన్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది.