E-Paper
Advertisement

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు
Advertisement

Sharjah: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యుఏఈలో అత్యంత దారుణ ఘటన బయటపడింది. ఓ ఎన్ఆర్ఐ కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఆయన చంపి, శరీరాన్ని తొమ్మిది భాగాలుగా నరికారు. రెండు సంచుల్లో కుక్కి ఓ కారులో పడేసిన ఘటన గల్ఫ్‌లోని భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటన తర్వాత భార్య-కొడుకు జాడ కనిపించలేదు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

షార్జాల్లో ఎన్నారై దారుణహత్య, జాడలేని భార్య-కొడుకు

యుఏఈలోని షార్జా సిటీలో కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన 44 ఏళ్ల ఆల్విన్ ప్రకాశ్ కుందర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన చంపిన దుండగులు, శరీరాన్ని తొమ్మిది భాగాలు చేశారు. ఆ తర్వాత వాటిని రెండు సంచుల్లో కుక్కి ఓ కారులో పడేశారు. ప్రకాశ్ గడిచిన 14 ఏళ్లుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య టీనా అక్కడే టీచర్‌గా చేస్తోంది. కొడుకు ప్రస్తుతం 10 తరగతి చదువుతున్నాడు.

ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది?

Advertisement

జూలై 20న అనిల్ ప్రశాంతి తన సోదరుడు ఆల్విన్ ప్రకాష్ ఫోన్ చేశాడు. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. కేవలం నేను బాగానే ఉన్నాను ఒక మెసేజ్ మాత్రమే వచ్చింది. ప్రకాశ్ ఎప్పుడు ఆ విధంగా మెసేజ్ పెట్టడు. దీంతో అన్న అనిల్‌కు అనుమానం రావడంతో వారం తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. అప్పుడు కూడా ఎలాంటి స్పందన రాలేదు. షార్జాలో తన స్నేహితుడు మనోహర్‌కు ఈ విషయాన్ని చెప్పారు అనిల్. ప్రకాశ్ నివాసానికి వెళ్లిన మనోహర్‌కు అక్కడి వాచ్‌మన్ కీలక విషయాన్ని చెప్పాడు. ప్రకాష్ కుటుంబంతో ఇండియా వెళ్లిపోయాడని చెప్పిన విషయాన్ని అనిల్‌కు తెలిపాడు. ఆల్విన్ పని చేసే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించారు. మొదట ఆల్విన్ ఇండియాకు వెళ్లారని అధికారులు చెప్పారు. ఇండియాకు రాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో కంపెనీ యాజమాన్యం పాస్‌పోర్ట్ రికార్డులను పరిశీలించింది.

ఒమన్‌కు వెళ్లే దారిలో కారులోని మృతదేహం

ప్రకాశ్ యుఏఈ దాటలేదని గమనించిన అధికారులు, వెంటనే షార్జా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఊహించని విషయాలు బయటపడ్డాయి. ఒమన్ వైపు వెళ్లే రహదారిలోని ఓ కారులో ఆల్విన్ ప్రకాశ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు చేసుకున్నారు. ఆయన గుండెలో పొడిచి చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. శరీరాన్ని తొమ్మిది ముక్కలు చేసి వాటిని రెండు సంచుల్లో ప్యాక్ చేసి కారులో పడేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత అనిల్.. ఉడుపి ఎస్పీని కలిసి విషయాలు చెప్పారు. హత్య వెనుకున్న హంతకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ప్రకాశ్ ఉన్న ఫ్లాట్ సీసీటీవీ ఫుటేజ్‌లో ముగ్గురు వ్యక్తులు బయటకు వెళ్లినట్టు కనిపించింది. అందులో ఇద్దరు పురుషులు-ఓ మహిళ దృశ్యాలు నమోదయ్యాయి.

Advertisement

ALSO READ: ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

ప్రకాష్ భార్య ఇండియాకు వస్తే హత్య గురించి ఆమెకు కచ్చితంగా తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే తప్ప ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావని అన్నారు. ప్రకాష్ భార్య-కుమారుడి ఆచూకీ లభించలేదు. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్న విషయం తమకు తెలియదని అనిల్ కుటుంబం తెలిపింది. ప్రకాష్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి యూఏఈలో చట్టపరమైన ప్రక్రియ చేయాలని కోరుతున్నారు. హత్య జరిగిన పరిస్థితులు, మృతదేహం లభ్యం కావడం, ప్రకాష్ భార్య-కుమారుడు ఎక్కడున్నారనే విషయాలపై షార్జా అధికారుల నుంచి మరింత సమాచారం కోరారు.

Tags

Related News

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

Big Stories

Advertisement
×