S Jaishankar: న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఓ పాత్రికేయుడు విసిరిన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చారు. పాకిస్థాన్ లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా అన్న ప్రశ్నకు.. తనదైన శైలిలో జైశంకర్ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.
పాకిస్తాన్‌లో భారత ప్రభుత్వం ఉగ్రవాద ప్రోత్సాహాన్ని ఎప్పుడు నిలిపివేస్తుంది? అని పాక్ విలేకరి విదేశాంగ మంత్రిని ప్రశ్నించగా.. ‘ఒక ఉగ్రవాద దేశం నన్ను ఈ ప్రశ్న అడుగుతోందా?’ అని జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తద్వారా పాక్ జర్నలిస్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అయితే సదరు పాత్రికేయుడు అంతటితో ఆగకుండా తన అసంబద్ద ప్రశ్నలను కొనసాగిస్తున్నప్పటికీ.. జైశంకర్ బృందం ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది.
Jaishankar’s Blunt UN Clapback!
Pakistani journalist: “When will your government stop sponsoring terrorism?”
Jaishankar: “A terrorist country is asking me that question? Come on!”#SJaishankar #IndiaPakistan #UNGA #BreakingNews #GlobalNews pic.twitter.com/zHyVHhIEdF
— Smriti Sharmaa (@SmritiSharma_) September 25, 2026
మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలోనూ భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. పక్క దేశాల భూభాగాలను ఆక్రమించాలని చూడటం లేదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మాని పాకిస్థాన్ ముందుగా తన దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఇతర దేశాల భూభాగాలను ఆశించడం, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం వల్ల పాకిస్తాన్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ఐరాస మండలిలో చేసే నాటకాలు, పాకిస్థాన్ రుణాలను తీర్చడానికి ఎంతమాత్రం పనికిరావు’ అని త్యాగి సెటైర్లు వేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను క్షితిజ్ త్యాగి ఈ సందర్భంగా ఐరాసలో ప్రస్తావించారు. గత జూన్ నుండి పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఆహారం, ఇంధనం, మందుల వంటి అత్యవసర సరఫరాలను ఇస్లామాబాద్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. దీనిపై నిరసన తెలిపిన సామాన్య ప్రజలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించి అనేకమందిని పొట్టనబెట్టుకుందని విమర్శించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలలో విద్యార్థులను అరెస్టు చేసిన తీరును ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఈ మండలి పరిశీలనకు వచ్చే అన్ని ప్రతికూల అర్హతలూ ఉన్న ఏకైక దేశం పాకిస్థాన్ మాత్రమేనని తీవ్ర స్వరంతో విమర్శించారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలే భారత్‌లో అనేక దాడులకు పాల్పడుతున్నాయని న్యూఢిల్లీ మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌పై పాక్ సీమాంతర ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ విషాదకర సంఘటనలో ఒక నేపాల్ పౌరుడితో సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!
పహల్గాం దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తో పాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో లష్కరే తొయిబా (LeT), జైషే మహమ్మద్ (JeM) వంటి నిషేధిత ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న స్థావరాలపై దాడులు చేసింది. భారత్ దాడి చేసిన తొమ్మిది ప్రాంతాల్లో ఐదు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండగా మరో నాలుగు పాకిస్థాన్ భూభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా జైషే మహమ్మద్‌కు కీలక స్థావరంగా ఉన్న బహావల్పూర్, ఉగ్రవాదుల ప్యాక్టరీగా ఉన్న ముజఫరాబాద్, భింబర్‌లతో పాటు కొట్లి, రావలాకోట్, చక్సవారి, నీలమ్ వ్యాలీ, జీలమ్, చక్వాల్‌లలోని శిక్షణా శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది.
Also Read: లింగ మార్పిడి చేసుకున్నాక, నాకు 2000 పెళ్లి సంబంధాలు వచ్చాయి