E-Paper
Advertisement

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!
Advertisement

Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ముందుకు తెచ్చిన 7 రోజుల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే నవంబర్ మిడ్‌టర్మ్ (మధ్యంతర) ఎన్నికల తర్వాత టెహ్రాన్‌పై అమెరికా తన వైమానిక దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.

ఐరాస వేదికగా ఇరాన్ ప్రతిపాదన

తాము విధించిన షరతులకు అమెరికా అంగీకరిస్తే.. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ సముద్ర మార్గాన్ని తిరిగి తెరుస్తామని, యుద్ధాన్ని ముగిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఐక్యరాజ్యసమితి వేదికగా విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు ఖతార్ మధ్యవర్తిత్వంతో 7 రోజుల శాంతియుత ప్రణాళికను అమెరికాకు అందించామని, అమెరికా తమ డిమాండ్లను నెరవేరిస్తే వారంలోగా సముద్ర రవాణాను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ ఎవరి బెదిరింపులకు లొంగదని, తమ సార్వభౌమాధికారాన్ని వదులుకోదని ఆయన స్పష్టం చేశారు.

ప్రతిపాదనను తోసిపుచ్చిన ట్రంప్

Advertisement

అయితే ఇరాన్ చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వార్తాసంస్థ వెల్లడించింది. ఇరాన్ తమ డిమాండ్లను నెరవేరుస్తుందనే నమ్మకం ట్రంప్‌కు లేదని అందుకే ఎన్నికల తర్వాత మళ్లీ దాడులు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బలం చేకూర్చేలా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. హర్మూజ్ జలసంధిని సర్కిల్ చేసి, దానికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు పెట్టడం సంచలనంగా మారింది.

ఇరాన్ డిమాండ్లు ఇవే

ఇరాన్ ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం.. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలి. అలాగే ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలి. దీంతోపాటు లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాల్లో కాల్పుల విరమణ పాటిస్తే.. ఇందుకు ప్రతిఫలంగా హోర్ముజ్ మార్గాన్ని తెరవడంతో పాటు తమ అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది.

Advertisement

Also Read: ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

గతంలో విఫలమైన ఒప్పందం

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడులతో ఈ యుద్ధం మొదలైంది. జూన్ 17న ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య 14 పాయింట్ల ఒప్పందం కుదిరినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదు. జూలై 8న ఆ ఒప్పందం రద్దయిందని ట్రంప్ ప్రకటించగా.. అమెరికా వాగ్దానాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ కూడా వైదొలిగింది. ప్రస్తుతం డీల్ కోసం తానేమీ తొందరపడటం లేదని ట్రంప్ తేల్చిచెప్పినప్పటికీ.. మధ్యవర్తులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని వైట్ హౌస్ ప్రకటించడం గమనార్హం.

Also Read: అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!

Tags

Related News

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

Big Stories

Advertisement
×