E-Paper
Advertisement

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?

సోనియానే నా హీరో అన్న యష్.. ఎందుకో తెలుసా?
Advertisement

Kissik Talks:కిస్సిక్ టాక్స్ 75వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన సంభాషణలో సరదా, కామెడీతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.ముఖ్యంగా యాదమరాజు , యష్ . పెళ్లి తర్వాత తమ లైఫ్ జర్నీ పై పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

కార్యక్రమంలో యాదమరాజు టాపిక్ వచ్చినప్పుడు ఆయనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. యాదమరాజుతో కాసేపు మాట్లాడినా చాలు.. మనలో కూడా పాజిటివ్ మార్పు వస్తుందన్నట్టుగా అక్కడున్న వారు చెప్పడం విశేషం. సాధారణంగా కొంతమంది వ్యక్తులు తమ మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను ఉత్సాహపరుస్తుంటారు. యాదమరాజు కూడా అలాంటి వ్యక్తేనని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడే తీరు, విషయాన్ని వివరించే విధానం, ఎదుటివారితో కలిసిపోయే స్వభావం గురించి అక్కడున్న వారు ఆకాశానికి ఎత్తేయడం షోలో హైలెట్ అని చెప్పాలి.

Advertisement

ఇక ఇదే సందర్భంలో యాదమరాజు మరో బిజినెస్ చేస్తే ఏం చేస్తాడనే ప్రశ్న కూడా వచ్చింది. దానికి చాయ్ షాప్ పెడితే బాగుంటుందనే సెటైర్ వేయడం వినిపించింది. ఇక స్టెల్లా ఇష్టమా లేక బుజ్జి పాప ఇష్టమా అంటే బుజ్జి పాపనే ఇష్టమని,దానికి స్టెల్లా కౌంటర్ గా ప్రోడక్ట్ ఒకే కాని మ్యాన్యుఫ్యాక్చర్ కంపెనీని ఎందుకు మర్చిపోతారు అనగానే ప్యార్లేజి బిస్కెట్ ప్యాకెట్ ని తింటావా లేక ఈ బిస్కట్ ప్యాకెట్ ని ఎవరు తయారు చేశారు అని ఆలోచిస్తావా అంటూ కౌంటర్ ఇవ్వడం అక్కడ నవ్వులు పూయించింది.

ఆ తర్వాత సోనియా ఆకుల గురించి యష్ ని ప్రశ్నలు అడగటంతో కాస్త ఈవెంట్ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్లింది. సోనియా తనకు చాలా ఇష్టమైన వ్యక్తి మాత్రమే కాకుండా, తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని, ఒకరకంగా తనే నా హీరో అంటూ యష్ చెప్పడం విశేషం. ముఖ్యంగా సోనియాను పక్కన పెట్టుకుంటే తనలో మరింత కాన్ఫిడెన్స్ వస్తుందని, ఆమె అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలదని వివరించారు యష్ . పెద్ద పెద్ద లాంగ్ జర్నీలు లేదా ఎక్కువసేపు జరిగే మీటింగ్స్ సమయంలో ఆమె ఇచ్చే సపోర్ట్ మాములుగా ఉండదని సోనియా ని మెచ్చుకున్నాడు యష్.

Advertisement

ఇక సోనియా తనకి కేవలం లైఫ్ పార్టనర్ గానే కాకుండా .. తన బిజినెస్ పనుల్లో కూడా బలమైన సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటుందని తెలిపాడు. సోనియా పక్కన ఉంటే తాను వెయ్యి రెట్లు మరింత శక్తివంతంగా ఫీల్ అవుతానని సోనియా పై తన కున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు యష్.

ఇక కార్యక్రమంలో రిలేషన్‌షిప్స్ గురించి కూడా సరదాగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆమెకు ఇప్పటికే పెళ్లైపోయి ఉండేదంటూ చేసిన కామెంట్ అక్కడ నవ్వులు పూయించింది. పర్సనల్ విషయాలని కూడా చాలా లైట్‌గా తీసుకుని మాట్లాడుకోవడంతో మరింత ఫన్‌గా సాగింది.

Tags

Related News

ఫైమా, యాదమరాజు మధ్య బాంగిల్స్ గోల.. నవ్వులే నవ్వులు!

సనాతన ధర్మంపై ఫైమా ఏమందో తెలుసా.. ఫ్యామిలీ రియాక్షన్ కూడా ఇదే!

యాదమరాజుతో ఫస్ట్ టైమ్ థియేటర్‌కు వెళ్లిన స్టెల్లా.. అక్కడ ఏం జరిగిందంటే?

ఫైమా బెటరా? వర్ష బెటరా?.. సమాధానం విని అంతా నవ్వాల్సిందే!

సింగిల్‌గా ఉండటమే బెస్ట్ అంటున్న వర్ష.. విష్ణుప్రియ కౌంటర్ అదుర్స్!

రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×