E-Paper
Advertisement

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!
Advertisement

South Africa Shooting: దక్షిణాఫ్రికాలో మరోసారి బుల్లెట్ల మోత మోగింది. ఆనందంగా గడుపుతున్న ఒక కుటుంబ వేడుక క్షణాల్లో రక్తసిక్తంగా మారిపోయింది. డర్బన్ నగర సమీపంలోని క్వామాఖుతా టౌన్‌షిప్‌లోని ఓ నివాస భవనంలోకి చొరబడిన సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

సంతోషంగా పార్టీ చేసుకుంటుండగానే..

Advertisement

స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. సదరు ఇంట్లో కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి సరదాగా పార్టీ చేసుకుంటున్నారు. అంతా సరదాగా గడుపుతున్న సమయంలో.. ఊహించని విధంగా ముగ్గురు దుండగులు ఆయుధాలతో ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న వారిపై ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒక్కసారిగా తుపాకుల మోత మోగడంతో భయంతో చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు.

అక్కడికక్కడే 10 మంది మృతి

Advertisement

ఈ దాడి ఎంత ఘోరంగా జరిగిందంటే.. కాల్పుల ధాటికి 10 మంది ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ విషాదంలో మరింత కలచివేసే అంశమేమిటంటే, మృతుల్లో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

పాత కక్షలే కారణమా?

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియనప్పటికీ, పాత గొడవలు లేదా ముఠాల మధ్య కక్షల కారణంగానే దుండగులు ఈ ఘాతకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Tags

Related News

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×