E-Paper
Advertisement

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!
Advertisement

Iran Embassy: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల ఆ దేశం ఊహించని రీతిలో స్పందించింది. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే ఆ దేశాన్ని ‘సమూలంగా తుడిచిపెట్టేస్తాం’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలకు.. టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య నటించిన సీన్‌ను వాడుకుంటూ సెటైరికల్ సమాధానం ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ భారత్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు

జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో సినిమా పోస్ట్ పెట్టింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని 58 సెకన్ల ఫైటింగ్ సీన్ ను అందులో పంచుకుంది. ‘ఇరాన్‌ను అంతం చేస్తానని ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ బలహీనమైన దేశం కాదని ఆయనకు బాగా తెలుసు’ అని ఆ వీడియోకు క్యాప్షన్ సైతం పెట్టింది. అంతేకాకుండా ‘వారు (ట్రంప్) హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూడటం మొదలుపెట్టినట్లు మాకు సమాచారం ఉంది’ అని సరదాగా ఇరాన్ ఎంబసీ రాసుకొచ్చింది.

బాలయ్య ఫైట్.. ఇరాన్ సందేశానికి లింకేంటి?

Advertisement

ఇరాన్ పోస్ట్ చేసిన భగవంత్ కేసరి మూవీ సీన్ లో బాలకృష్ణ ఒక భారీ మ్యాన్‌హోల్ మూతను వాడుకుంటూ శత్రువుల తుపాకీ గుళ్లను తట్టుకుని నిలబడతారు. చుట్టూ ఆయుధాలు పట్టుకున్న ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా విరోచితంగా పోరాడుతారు. దీంతో ఈ పాత్రను ఉదాహరణగా చూపిస్తూ.. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగిపోదని, తమను తమ ప్రతిఘటనతో కాపాడుకోగలమని ఇరాన్ రాయబార కార్యాలయం పరోక్షంగా సందేశం ఇచ్చినట్లు ఈ పోస్ట్ ను బట్టి అర్థమవుతోంది.

‘బాలీవుడ్’ అని అనడంతో నెటిజన్ల ట్రోలింగ్

Advertisement

అయితే టాలీవుడ్ స్టార్ అయిన బాలయ్య మూవీ క్లిప్ పట్టుకొని.. ఇరాన్ తన పోస్ట్ లో బాలీవుడ్ అని మెన్షన్ చేయడంపై నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. ఈ పోస్ట్ కు సంబంధించిన కామెంట్ బాక్స్ లో భారతీయ మూవీ లవర్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది టాలీవుడ్ సినిమా అని పేర్కొంటున్నారు. అదే సమయంలో బాలయ్య సినిమాలకు సంబంధించిన మరిన్ని క్లిప్స్ ను షేర్ చేస్తున్నారు.

ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే?

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా? ఆ దేశంపై విరుచుకుపడి నాశనం చేయాలా? అనే దానిపై తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా సినిమా సీన్‌తో సమాధానం ఇవ్వడం అంతర్జాతీయంగా ఆసక్తిరేపుతోంది.

Also Read: తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

మధ్యవర్తుల ద్వారా శాంతి చర్చలు

అయితే సోషల్ మీడియాలో ఇలాంటి సెటైర్లు పేలుతున్నప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య రాయబార చర్చలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్‌లో మధ్యవర్తుల ద్వారా ఇరుదేశాల ప్రతినిధులు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. యుద్ధాన్ని నిలిపివేయడం, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడం, ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను ఇరాన్ విధించినట్లు సమాచారం.

Also Read: సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

Tags

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

Big Stories

Advertisement
×