E-Paper
Advertisement

డోనాల్డ్ ట్రంప్‌‌కు ఘోర అవమానం.. పట్టించుకోని నార్త్ కొరియా..?

డోనాల్డ్ ట్రంప్‌‌కు ఘోర అవమానం.. పట్టించుకోని నార్త్ కొరియా..?
Advertisement

Trump Kim: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు మిడ్ టర్మ్ ఎన్నికల ఓటమికి మించిన అవమానం జరిగింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో మాట్లాడేందుకు ఏడాది నుంచి ట్రంప్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నించినా కిమ్ మాత్రం కిమ్మనలేదు. ఫైనల్ అటెంప్ట్‌గా ఓ లేఖ రాసి కిమ్ జోంగ్ ఉన్‌కు పంపించాలని అధికారులకు ఇచ్చారు. దీనికోసం అమెరికా అధికారులు పక్కా ప్లాన్ గీశారు.

నార్త్ కొరియా ప్రతినిధి..

మన్‌హట్టన్‌లోని ఐక్యారాజ్యసమితి బిల్డింగ్‌లో ఉన్న నార్త్ కొరియా శాశ్వత ప్రతినిధికి ట్రంప్ ఇచ్చిన లేఖని ఇవ్వాలి అనుకున్నారు. అష్టకష్టాలు పడి చివరకు ఉత్తరకొరియా దౌత్యవేత్తకు ఆ లేఖ అందించారు. తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న ఆ దౌత్యవేత్త తిరిగి వెళ్లే సమయంలో ట్రంప్ లెటర్‌ని అక్కడే టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. కనీసం లెటర్‌పై ఉన్న సీల్ కూడా తీయలేదు.

సాలిడ్ ఫ్యూయల్ రాకెట్లు..

Advertisement

2019లో కిమ్-ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. అప్పటి నుంచి నార్త్ కొరియా అణ్వాయుధాల తయారీని మరింత స్పీడప్ చేసింది. ఏడేళ్లలో అణువార్‌హెడ్ సంఖ్యని డబుల్ చేసింది. గతంలో కేవలం లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ మోటార్లను వాడే ఉత్తరకొరియా, ఇప్పుడు సాలిడ్ ఫ్యూయల్ రాకెట్లు రెడీ చేసింది. వాటిని గుర్తించడం అమెరికాకు కష్టం. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా అణ్వస్త్ర ప్రయోగాలపై పరిమితి విధించేందుకు ఒత్తిడి చేయాలని అమెరికా భావిస్తోంది.

కిమ్‌తో భేటీ..

ఈ నేపథ్యంలోనే ఇటీవలి ఆసియా టూర్ సమయంలో కిమ్‌తో భేటీకి ప్రయత్నించారు డొనాల్డ్ ట్రంప్. కానీ నార్త్ కొరియా కండిషన్స్ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో తిరిగొచ్చేశారు. తమని అణ్వస్త్ర దేశంగా గుర్తించాలి అనేది కిమ్ ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీనికి అమెరికా ఒప్పుకోకపోవడంతోనే చర్చలు కుదరడం లేదు. ఇదే సమయంలో ట్రంప్ లెటర్‌ని కనీసం చదవకుండానే తిప్పి పంపడం కిమ్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది.

Advertisement

Also read: వెంకీ మామ చైతూ పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. ఇద్దరిదీ ఒకటే క్యారెక్టర్ అంటూ!

Tags

Related News

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింసలు.. 30 ఇళ్లకు పైగా అగ్గిపాలు

తరాలు మారినా వీరి ఇల్లు మాత్రం మారదు.. చైనాలో ఓ అద్బుత రాజ్యం?

టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్.. విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీగా పన్నులు, విశాఖ డేటా సెంటర్ మాటేంటి?

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మాజీ చీఫ్ యూనస్ ఇంటికి దుండగుల నిప్పు, భారీగా బలగాలు మోహరింపు

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

Big Stories

Advertisement
×